వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆరోగ్య తెలంగాణ

August 12, 2019

ఫోటో: సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు
ఫోటో: సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు

సిఎం స్వగ్రామం నుంచే మొదలు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వ్గగ్రామం చింతమడక నుండే ఆరోగ్య తెలంగాణకు అడుగులు పడుతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్ధిపేట రూరల్‌ ‌మండలం చింతమడక గ్రామంలో యశోద ఆసుపత్రి వారి సౌజన్యం తో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో హరీష్‌ ‌రావు పాల్గొని మాట్లాడారు. చింతల్లేని తెలంగాణ…చింత మడక నుండే ప్రారంభమౌవుతుందన్నారు. దేశంలోనే తొలిసారిగా చింతమడక, మాచపూర్‌, ‌సీతారాంపల్లి నుండే ఆరోగ్య సూచి రుపొందించడం జరుగుతుందన్నారు. దేశంలోనే గ్రామ ప్రజల అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఆరోగ్య సూచిక చేసినా మొదటి గ్రామం చింతమడక అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చేయాలని సీఎం కేసీఆర్‌ ‌భావించారన్నారు. ఇంగ్లండ్‌, అమెరికా లాంటి దేశాల తర్వాత మన దగ్గర మొదటప్రారంభం అయిందన్నారు. సిఎం కేసీఆర్‌ ‌చొరవతో యశోద అసుపత్రి రూపాయలు కోటి వెచ్చించి 8రోజుల్లో 5, 561 మందికి 36,146 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. చేసిన పరీక్షలను వారం రోజుల పాటు ఏవేల్యూవేషన్‌ ‌చేసి సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్యులచే చికిత్స అందిస్తారన్నారు. కేసీఆర్‌ ‌చెప్పిన మాటకు కట్టుబడి ప్రజలందరికీ మంచి ఆరోగ్యసూచిక అందిస్తుమన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత,శుభ్రత, పరిసరాల శుభ్రత అవసరం అన్నారు. గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా పారిశుద్య సిబ్బందికి అందించాలన్నారు. త్వరలోనే గ్రామ అభివృద్ధి కోసం సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈకార్యక్రమంలో సుడా చైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌రెడ్డి, పజాప్రతినిధులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.