కూకట్ పల్లి ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టిందని, ఈ ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం తమదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్వర్యంలో ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని బాలానగర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టే ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గ బాలానగర్ (120) డివిజన్ చెరబండ రాజు నగర్ లో రెండవ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన దరఖాస్తు సేకరణ సెంటర్లను బాలానగర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టే ప్రసన్నకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రవేశపెట్టిన మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, చేయూత పథకాలను ప్రజలకు వివరిస్తూ అసలైన నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ పాలనలోనే లబ్ధి జరిగిందని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ తోనే సాధ్యమని, పది సంవత్సరాలు పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు, డబల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వని దుస్థితి ఉండేదన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే బ్రహ్మాండంగా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టింది మట్టే ప్రసన్నకుమార్





