ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 21 : ఆమనగల్లు పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమనగల్లు పోలీస్ స్టేషన్ లో ఉన్న దివంగత ఎస్సై హనుమంత్ రెడ్డి విగ్రహానికి ఆమనగల్లు ఎస్సై బలరాం, ఎ ఎస్ఐ బాల్ రెడ్డి లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసులు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఆమనగల్లు లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
