ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 6 : ఆమనగల్లు మున్సిపాలిటీలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో నిరసన దీక్ష చేపట్టారు ఈ దీక్షను ఆమనగల్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్ ఎ బి వి పి నాయకులకు పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ సింగ్ పలువురు నాయకులు మాట్లాడుతూ ఆమనగల్లు నుండి దిల్ సుఖ్ నగర్ తరలించిన బీ,సీ హాస్టల్ ను తిరిగి ఆమనగల్లులో పున ప్రారంభించాలని కోరారు. షాబాద్ లో కొనసాగుతున్న ఆమనగల్లు కు చెందిన బాలికల గురుకుల హాస్టల్ ను తిరిగి ఆమనగల్లులో ప్రారంభించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం వెంటనే పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన భవనంలో కళాశాలలను ప్రారంభించాలని కోరారు. మున్సిపాలిటీలో పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రభుత్వ బస్టాండ్ హై స్కూల్ భవనాన్ని మార్చి నూతన భవనం ఏర్పాటు చేయాలన్నారు. డిగ్రీకళాశాలకు, పాలిటెక్నిక్ కళాశాలకు భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పై సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. సమస్యలను కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వెంటనే పరిష్కరించాలని కోరారు లేనియెడల వివిధ రూపాల్లో ఉద్యమ కార్యక్రమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షకు ఏబీవీపీ పూర్వ నాయకులు శ్రీకాంత్ సింగ్, వరికుప్పల శీను, పాతకోట శ్రీశైలం సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ కదండి శ్రీరామ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరెటి భరత్, ఏబీవీపీ నాయకులు కోట్ర సురేష్, మొక్తల సాయి, తరుణ్ నాయక్, శివ గౌడ్, మల్లేష్, సుమన్ నాయక్, బద్రు నాయక్, శంకర్, సాయి, సునీల్ నాయక్, శివ ముదిరాజ్, సిద్దు, నందు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.