లిప్త కాలపు నిర్ణయాలే..
జీవితాలను హరిస్తున్నాయ్
అల్పమైన సమస్యలే..
ప్రాణదీపాల ఆర్పేస్తున్నాయ్
నిరాశపూరిత ధోరణులే..
బావితరాల బలిస్తున్నాయ్
అపూర్వమైనది జీవితం
మనిషికి దక్కిన వరము
మానసిక ఒత్తిళ్లకు తలొగ్గి
నిండు నూరేళ్ళ జీవితాన్ని
బలిపెట్టుకోవడం పాతుకం
కన్న కలలను త్యజించి
కన్నోళ్ల ఆశలు అవిరిచేసి
కడతేరిపోవడం అవివేకం
అయినా జీవితం అనేది
ఎవ్వరికీ పూల దారి కాదు
వడ్డించే విస్తరి అసలే కాదు
జీవించడం అంటే..
అడ్డంకులను అధిగమించి
మునుముందుకు సాగడం
లక్ష్యం ఎంత కఠినమైనా
అలుపెరుగక పోరాడితే
విజయం స్వాగతిస్తుంది
జీవితం సార్థకమౌతుంది
ఇకనైనా నిరాశ జీవులకు
విశ్వాస దీపం వెలిగిద్దాం
మీవెంట మేమున్నామనే
భరోసా హస్తం అందిద్దాం
అన్నిటా తోడుగా నిలిచి
మానవతను చాటుదాం
మనోస్థైర్యం పెంపొందించి
ఆత్మహత్యల్ని నివారిద్దాం
– కోడిగూటి తిరుపతి, 9573929493