ఆకలి సూచీల్లో పాక్,బంగ్లా కన్నా వెనక
రాష్ట్రం సాధించడమే కాదు..అభివృద్ది చేసి చూపాం
కెసిఆర్ వల్లనే సాధ్యమయ్యింది
అనేక పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలిచాం
ప్లీనరీ వేదికగా మంత్రి హరీష్ రావు
అచ్చేదిన్ నినాదాలు బూటకం…బిజెపితో సచ్చేదిన్ వొచ్చింది : వి•డియాతో మంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : బీజేపీ నేతలు ఆత్మనిర్భర్ భారత్ అంటారనీ.. కానీ బతుకు దుర్భర్ భారత్ అయ్యిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆకలి సూచీల్లో మనం ఎక్కడో ఉన్నామనీ.. పాక్, బంగ్లాదేశ్ మనకన్నా ముందన్నాయనీ.. ఇది బీజేపీ పాలనా తీరని ధ్వజమెత్తారు. బుధవారం టీఆర్‌ఎస్ ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వం సెస్‌ల రూపంలో వసూలు చేసే మొత్తాన్ని డివిజనల్ పూల్‌లోకి తేవాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానే రాదన్న తెలంగాణ సాధించి, దేశంలో ఆదర్శ రాష్ట్రంగా సీఎం కేసీఆర్ నిలపారన్నారు. 14 సంవత్సరాలు పోరాడి ఎత్తిన పిడికిలి దించకుండా రాష్టాన్న్రి సాధించిన పార్టీ టీఆర్‌ఎస్ అనీ, దేశంలోనే అతిచిన్న వయసు కలిగిన రాష్ట్రమైనా అన్ని రాష్టాల్రకు దశ-దిశ చూపిందన్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన ప్రగతిశీల ఎజెండా దేశానికి అవసరమని, పక్క రాష్టాల్ర నుంచి కేసీఆర్ ఎజెండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ల్గ•తుబంధు, దళితబంధు, ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ తదితర పథకాలు మకు కావాలని పక్క రాష్ట్ర బీజేపీ నేతలు కోరుతున్నారని, సీఎం ఆలోచనలు, చిన్న పాలసీలు ఎన్నో గుణాత్మక మార్పునకు నాందిపలికాయన్నారు. పల్లె ప్రగతి, పట్టణప్రగతి అద్భుతమైన ఆలోచనతో స్థానిక సంస్థలను బలోపేతం చేసి, నిధులు, విధులు, ఉద్యోగాలు కల్పించి రూ.13వేల కోట్లు ఇస్తే దేశంలో సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద పదికి పది తెలంగా గ్రామాలు మొదటి స్థానంలో ఉన్నాయంటే ఎంత అభివృద్ధి, ఎంత అద్భుత ఫలితాలు సాధించామన్నారు. గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించామన్నారు. కేంద ప్రభుత్వ సిద్దాంతం ఏంటంటే.. ’కేంద్రం బలంగా ఉండాలి. రాష్టాల్రు ఆర్థికంగా బలహీనంగా ఉండాలి. రాష్టాల్రకు అధికారాలను తగ్గించాలి’ ఇదే కేంద్రం సిద్దాంతమన్నారు. రాష్టాల్రు కేంద్రం చెప్పు చేతల్లో ఉండాలని చేస్తోన్న ప్రయత్నం ఇదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానిది వైఫల్యాల చరిత్ర అనీ, తెలంగాణ ప్రభుత్వానిది సాఫల్యాల చరిత్ర అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో సాధించిన అద్భుత ఫలితాలు, ధరణి పోర్టల్‌తో భూ సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభించిన సమయంలో కానే కాదనీ, గోదావరి నీళ్లు రావన్నారన్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పట్టుబట్టి రాత్రింబవళ్లు పని చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని నీళ్లు ఇస్తున్నామని, తెలంగాణ అంతా సస్యశ్యామలమైందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందే 99లక్షల టన్నుల ధాన్యం పండితే ఇప్పుడు 2.50లక్షల టన్నుల దిగుబడి వస్తుందన్నారు. కేంద్రానికి వైఫల్యాల చరిత్ర అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మాటలు మాట్లాడుతుందని, ఏడేళ్లలో దేశ ఆర్థిక వృద్ధి రేటుపడిపోయిందని, ఆ నాడు 8శాతం ఉంటే ఇవాళ 5.7శాతానికి పడిపోయింద న్నారు. బీజేపీ ధరలు పెంచి, మతకల్లోలాలు సృష్టించి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అచ్చేదిన్ అన్నారు.. కానీ ప్రజలకు చచ్చేదిన్ చేశారని ఆరోపించారు. నల్లధనం తెస్తామని చెప్పి.. రైతాంగానికి నల్ల చట్టాలు తెచ్చారని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టారనీ.. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ.. ఊడగొడుతున్నారని మండిపడ్డారు. కొత్త పరిశ్రమలు తెస్తామని చెప్పి.. ఉన్న వాటిని అమ్ముకుంటున్నారని, బీజేపీ ప్రభుత్వం అమ్మిన ప్రభుత్వరంగ సంస్థల విలువ మూడున్నరలక్షల కోట్లని పేర్కొన్నారు. మోదీ చాయ్ అమ్మిండని.. బుల్లెట్ ట్రైన్లు తెస్తామన్నారని.. కానీ వాస్తవానికి రైళ్లు, రైల్వేస్టేషన్లు జరుగుతున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వం రాక ముందు నిరుద్యోగం 4.7 శాతం ఉంటే, ఏడేళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగం 7.11 శాతానికి పెరిగిందన్నారు. పేదల అకౌంట్లలో డబ్బులు వేస్తామన్నారనీ.. జన్‌ధన్ ఖాతాలన్నారని, కానీ రూపాయి పేదలకు ఇవ్వలేదన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తామని చెప్పి ఎరువుల ధరలు, డీజిల్ ధరలు పెంచారన్నారు. ఆదాయం పెరుగలేదని, పెట్టుబడి మాత్రం పెరిగేలా చేశారని విమర్శించారు. రైతుల ఉసురు పోసుకుంటన్నరి, బీజేపీ ప్రభుత్వం కార్మికులకు, ఉద్యోగులకు, కర్షకులకు, యువతకు, మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఏ వర్గానికి ఉపయోగపడిందని ప్రశ్నించారు. సంపద పెంచాలని, పేదలకు పెంచాలన్నది టీఆర్‌ఎస్ నినాదమన్నారు.
అచ్చేదిన్ నినాదాలు బూటకం…బిజెపితో సచ్చేదిన్ వొచ్చింది : వి•డియాతో మంత్రి హరీష్ రావు
బీజేపీ హయాంలో అచ్చేదిన్ కాదని, సచ్చేదిన్ వొచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు. దేశంలో రైతులకు, నిరుద్యోగులకు కాషాయ పార్టీ చేసిందేవి• లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదిక వద్ద మంత్రి వి•డియాతో మాట్లాడుతూ… దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ దశ, దిశగా మారిపోయిందని చెప్పారు. రైతుబంధు, మిషన్ భగీరథ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని వెల్లడించారు. జీఎస్‌డీపీలో రాష్ట్రం వృద్ధి సాధించిందని తెలిపారు. ప్లీనరీ సందర్భంగా జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పాత్రపై చర్చిస్తామన్నారు. ప్లలెప్రగతి, పట్టణప్రగతిలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందన్నారు. పన్నెండు, పదమూడు రాష్ట్రాల నుంచి కూలీలు తెలంగాణకు వొచ్చి పనిచేస్తున్నారని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ప్రజలు వలస వొస్తున్నారని చెప్పారు. బండి సంజయ్ పాదయాత్ర ప్రజలు లేక వెలవెలబోతున్నదని ఎద్దేవా చేశారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయని బండి తన పాదయాత్రలో బెబుతారా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత ఏ రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఏది బాగుందో చూపెట్టాలన్నారు. బీజేపీ హయాంలో అచ్చేదిన్ కాదు..సచ్చేదిన్ వొచ్చిందని వెల్లడించారు. పీకే బీజేపీతో ఉంటే గొప్పోడు, మాతో ఉంటే తప్పా అని ప్రశ్నించారు. తమ పనితీరు బాగుందని, అందుకే పీకేను తీసుకున్నామని చెప్పారు.