సుబేదారి ప్రజాతంత్ర ఆగస్ట్ 27: ఆటోలో మర్చిపోయిన సూమారు 12 లక్షల రూపాయల విలువగల 240 గ్రాముల బంగారు అభరణాలు వున్న బ్యాగును నిమిషాల వ్యవధిలో గుర్తించి తిరిగి బాధిత మహిళకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అప్పగించారు. ఈ సంఘటన సంబంధించి ట్రాఫిక్ ఏసిపి భోజరాజు వివరాలను వెల్లడిస్తూ గత రాత్రి కాశిబుగ్గ, ఇందిరమ్మ కాలనీకి చెందిన కందగట్ల జోత్స్న వరంగల్ చౌరస్తా బట్టలతో పాటు తన ఇంటిలోని బంగారు. అభరణాలకు మెరుగు పెట్టించుకొని ఆటోలో కాశిబుగ్గ చౌరస్తాలోదిగి ఇంటికి వెళ్ళింది. వెళ్ళి బంగారు అభరణాల బ్యాగు ఆటోలోనే మర్చిపోయింది. సదరు బాధిత మహిళ కాశిబుగ్గ చౌరస్తాలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఎర్రరవికి సమాచారం ఇవ్వడంతో తక్షణమే అప్రమత్తమైన హోంగార్డు తన మ్యాన్ ప్యాక్ ద్వారా ఇన్స్పెక్టర్ వెంకన్నతో పాటు, మిగితి ట్రాఫిక్ సిబ్బంది సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వరంగల్లోని అన్ని ఆటో స్టాండ్లతో పాటు, ఆటో యూనియన్కు సమాచారం ఇచ్చారు. బాధిత మహిళ ప్రయాణించిన ఆటో డ్రైవర్ తన వున్న బ్యాగును గుర్తించి ఆటో యూనియన్, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ట్రాఫిక్ పోలీసులు ఆటోలోని బంగారు అభరణాల బ్యాగును స్వాధీనం చేసుకోని బాధిత మహిళకు ట్రాఫిక్ ఎసిపి భోజరాజు, వరంగల్ ట్రాఫిక్ ఇన్సెస్పిక్టర్ వెంకన్న. ఎస్.ఐ శ్రవణ్ కుమార్, హోంగార్డ్ రవి సమక్షంలో బాధిత మహిళకు బంగారం వున్న బ్యాగును తిరిగి అప్పగించారు.
ట్రాఫిక్ హోంగార్డు రవితో పాటు ట్రాఫిక్ అధికారులు వేగంగా స్పందించి నిమిషాల వ్యవధిలో 12లక్షల విలువైన 240 గ్రాముల బంగారు అభరణాలు వున్న బ్యాగును తిరిగి తమకు అప్పగించినందుకు బాధిత మహిళతో పాటు వారి కుటుంబ సభ్యులకు ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసారు.