ఆగని పెట్రో బాదుడు

  • తొమ్మిది రోజుల్లో ఎనిమిది సార్లు పెంపు
  • లీటర్‌ ‌పెట్రోల్‌పై మరో 90 పైసలు..డీజిల్‌పై 87 పైసలు పెంపు

న్యూ దిల్లీ, మార్చి 30 : దేశవ్యాప్తంగా పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉన్నది. గత మంగళవారం మార్చి 22 మొదలు మధ్యలో ఒక్కరోజు మార్చి 24న మినహా  ప్రతిరోజూ పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వాహనాలను బయటకు తీయాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజు అటూఇటుగా పెట్రో, డీజిల్‌పై 90 పైసల చొప్పున వడ్డిస్తూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. గత తొమ్మిది రోజుల్లో లీటరుపై మొత్తంగా రూ.5.60 భారం మోపాయి. పెట్రో బాదుడులో ఎనిమిదో రోజైన బుధవారం లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ‌ధర రూ.114.51కి చేరగా, డీజిల్‌ ‌ధర రూ.100 దాటింది. ప్రస్తుతం డీజిల్‌ ‌రూ.100.70కు చేరింది. ఇలా పెట్రో ధరలు రోజురోజుకూ భగ్గుమంటున్నాయి.

ఈ ధరలు సామాన్యుల టెన్షన్‌ను పెంచుతున్నాయి. కరీంనగర్‌లో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.114.69గా ఉండగా.. లీటర్‌ ‌డీజిల్‌ ‌ధర ధర రూ.100.82గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్‌ ‌ధర రూ. 114.60గా ఉండగా.. డీజిల్‌ ‌ధర రూ.100.77గా ఉంది. మెదక్‌లో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.114.63గా ఉండగా.. డీజిల్‌ ‌ధర రూ.100.81గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ. 114.52 ఉండగా.. డీజిల్‌ ‌ధర రూ.100.71గా ఉంది. వరంగల్‌లో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ. 114.02 పలుకుతుండగా.. లీటర్‌ ‌డీజిల్‌ ‌ధర రూ.100.23గా ఉంది. ఆంధప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌రూ.116.39కు లభిస్తుండగా.. లీటర్‌ ‌డీజిల్‌ ‌ధర రూ.102.09లకు లభిస్తుంది. ఇక దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు గమనిస్తే..

దేశ రాజధాని దిల్లీలోని లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.101.01 గా ఉండగా.. లీటర్‌ ‌డీజిల్‌ ‌ధర రూ. 92.27 లకు లభిస్తుంది. ముంబైలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.115.88కు లభిస్తుండగా.. లీటర్‌ ‌డీజిల్‌ ‌ధర రూ.100.10 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్‌ ‌ధర రూ.110.52 చొప్పున ఉండగా.. డీజిల్‌ ‌ధర రూ. 95.42 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ‌ధర రూ. 106.88 ఉండగా.. డీజిల్‌ ‌ధర రూ.96.76గా ఉంది. బెంగళూరులో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.106.46 పలుకుతుండగా.. డీజిల్‌ ‌ధర రూ.90.49గా ఉంది. లక్నోలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ. 100.86 ఉండగా.. లీటర్‌ ‌డీజిల్‌ ‌ధర రూ.96.76గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page