- లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెంపు
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.61 కాగా, డీజిల్ ధర రూ. 99.83
న్యూ దిల్లీ, మార్చి 29 : దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు రోజుకురోజు పురుగుతూనే ఉన్నాయి. గడిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చమురు ధరలు పెరిగాయి. తాజాగా మంగళవారం లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.61 కాగా, డీజిల్ ధర రూ. 99.83గా ఉంది.
విజయవాడలో పెట్రోల్ రూ. 115.37, డీజిల్ రూ. 101.23గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.21, డీజిల్ ధర రూ. 91.47, ముంబైలో పెట్రోల్ రూ. 115.04, డీజిల్ రూ. 99.25, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.94, డీజిల్ ధర రూ. 96, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ. 109.68, డీజిల్ ధర రూ. 94.62గా ఉంది.