- ఆంధ్రా పార్టీలు అవసరం లేదని అన్నావా లేదా
- పోలవరంపై ‘సుప్రీమ్’లో కేసులు వేసావా లేదా
- ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఎపిలో కాలుపెడతావు
- కెసిఆర్‌కు ప్రశ్నలు సంధించిన బిజెపి ఎంపి జివిఎల్
విశాఖపట్టణం,జనవరి3(ఆర్‌ఎన్‌ఎ)
ఆంధ్రవాళ్ళును కేసీఆర్ కుక్కలు అన్నారా? లేదా? అని జీవీఎల్ ప్రశ్నించారు. ఆంధ్రవాళ్ళని తరిమి తరిమి కొడతానని కేసీఆర్ అన్నారా? లేదా? అని నిలదీశారు. ఆంధ్ర పాలకులు మనకు అవసరమా అని కేసీఆర్ అన్నారు. సేమ్ ఫీలింగ్.. కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలి. ఏపీకి నీళ్లు, నిధులు, ప్రాజెక్టులు అన్ని కేసీఆర్ అడ్డుకుంటున్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని కేసీఆర్ లెటర్ రాశారు. సుప్రీంలో కేసులు వేశారు. పోలవరంపై కేసులు వెనక్కి తీసుకోవాలి. ఆంధ్ర, రాయలసీమను ఎడారి చేయాలని కేసీఆర్ చూశారు. రాజధాని లేకుండా కేసీఆర్ చేశారు. కేసీఆర్‌ని ప్రశ్నించే దమ్ము జగన్, చంద్రబాబుకు లేదు. రౌడీ రాజకీయాలకు.. భయపడి తెలంగాణలో ఆంధ్రులు గతంలో ఓటు వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.మార్చుకుని మేకవన్నె పులి కేసీఆర్ ఏపీకి వస్తున్నారు. ఆంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఏపీలో కేసీఆర్ అడుగు పెట్టాలన్నారు. తెలంగాణలో విఫలమైన కెసిఆర్ ఎపిలో ఏమి వెలగబెడతారని అన్నారు. ముందు తెలంగాణలో మంచి పాలన అందించాలని సూచించారు. ఏదో సాకు చెప్పి పాదయాత్ర, సభలపై ఆంక్షలు పెట్టడం సరికాదు. ప్రతిపక్షాలు గొంతు నొక్కాలని జగన్ చూస్తున్నారని పేర్కొన్నారు.
కెసిఆర్‌కు ఎపిలో అడుగుపెట్టే హక్కు లేదు : పాల్
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుతో జతకడితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ప్రజలు నమ్మరని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్అన్నారు. మంగళవారం డియాతో మాట్లాడుతూ… కేసీఆర్ కు ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదన్నారు. తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ అమ్ముడుపోయారని
ఆరోపించారు. జగన్‌తో సహా ఎవరూ ఏపీని అభివృద్ధి చేయలేదని తెలిపారు. నాకు అవకాశం ఇవ్వండి.. లక్ష కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తా అంటూ కేఏ పాల్ పేర్కొన్నారు.