ఇటువంటి సాహితీ సంబురం జరగడం చాలా సంతోషాన్నిస్తోంది. కాని ఇప్పటిదాకా ప్రభుత్వానికి ఇటువంటి ఆలోచన రాకపోవడమే బాలేదు. సాహితీ సమాలోచనకు బుక్ ఎగ్జిబిషన్ నడపడం మాత్రమే కాకుండా రచయితలు, పబ్లిషర్లు, చదవరులు కలిసే పండుగ బావుంటుంది. సరైన దిశగా చర్చలు జరిపితే సమాజంలో మేధోచర్చలకు ఆస్కారం ఉంటుంది, అది సమాజ పురోగతికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే ఇది ఒక్కరోజుగా కాక అయిదు రోజులపాటు చేయగలిగితే ఇంకా ఎన్నో అంశాలపై దృష్టి సారించగలము. అన్ని రోజులపాటు వేడుక నిర్వహించాలంటే సాహిత్యంతో ప్రభుత్వం తప్పనిసరిగా చేయికలపాలి.
-అపర్ణ తోట





