అమ్మ నెరగను…!!

చందమామని మభ్య పెట్టి
బూచోడిని భయపెట్టి!
అమ్మ తినిపించిన వెన్నెలముద్దల్ని
ఎరగను !!
అమ్మపాడే లాలి జోల పాట రాగాల
చెమ్మ స్సర్శినీ ఎరిగను
తప్పుల తడకల తోవల!వెంటనే
తన్మయుణ్ణే సాగుతున్నప్పుడు!
నా నిషా మనసుపై చెంపదెబ్బల !
చిలకరింపయ్యేదన–
అమ్మ
క్షతగాత్ర మనశ్శరిరుణై
నే నిద్రపోతున్నప్పుడు
నిలువెల్లా దిగులు దీపమై
నా చుట్టూ వెలిగేదీని—-
నా చిన్నతనమంతా
నా తల్లిని చిన్నబుచ్చుతూనే వుందని
నా బాల్యమంతా భాస్వరంలా
నా తల్లి గుండెల్ని మండిస్తూనే వుందనీ..
ఎరగను!
ఏ నిశి అమ్మ రుములోనో
నిశ్శబ్దంగా తెగిపడే
కన్నీటీబోట్ట వెంట జారి.. జారి
నేనెప్పుడూ
అమ్మ కు
దూ….రం …గా….

-బి.ప్రవీణ్
8142460664
సీకేఎం కళాశాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page