పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వందనపురి కాలనీ, భరత్ నగర్ కాలనీ, మల్లారెడ్డి కాలనీ, నల్లూరి హైట్స్, ఎస్ ఎల్ ఎన్ హోమ్స్ కాలనీలలో పర్యటించి కాలనీ వాసులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకొని, కాంగ్రెస్ పార్టీ 6. గ్యారంటీలను వివరించిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్, సతీమణి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ.. సమస్యలు ఏమైనా ఉంటే తప్పకుండా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్, కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ యాదవ్, ఎండి సలీమ్, మహేష్, ప్రకాష్, మురళి, విజయ్, ఈశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్, ప్రవీణ్, గోపాల్ రెడ్డి, భిక్షపతి, మల్లేష్, చుక్క రెడ్డి, అప్పారావు, బి శ్రీనివాస్, ఎల్లయ్య, సురేష్, లక్ష్మీకాంత్, క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.