అభ్యుదయ కవి నేడు మహాకవి శ్రీ శ్రీ జయంతి

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావుగా లబ్ద ప్రతిష్టులైన శ్రీశ్రీ (ఏప్రిల్‌ 30, 1910 – ‌జూన్‌ 15,  1983). ‌విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన వారిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షులుగా, సినిమా పాటల రచయితగా ఆయన సుప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది, నాస్తికులు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందారు.  శ్రీశ్రీ  పుట్టిన దినం గురించి,  ఫిబ్రవరి 1, 1910 న జన్మించానని ఆయన విశ్వసిం చినా, పరిశోధకులు కొందరు 1910 ఏప్రిల్‌ 15‌న జన్మించారని పేర్కొన్నా, విశాఖపట్నం పురపాలక సంఘం వారు ఖరారు చేసిన తేదీనే  1910 ఏప్రిల్‌ 30 అని విరసం వారు స్పష్టీకరించారు.  శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఇతను ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో చేసారు. 1925లో ఎస్‌ ఎస్‌ ఎల్‌ ‌సీ వుత్తీర్ణుడు అయినారు. అదే సంవత్సరం వెంకట రమణమ్మను పెళ్ళి చేసుకున్నారు. 1931 లో మద్రాసు విశ్వ విద్యాలయంలో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసారు.

1935లో విశాఖ లోని మిసెస్‌ ఎ ‌వి ఎస్‌ ‌కాలేజీలో డిమాన్స్ట్రేటరుగా చేరారు. 1938లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్‌ ఎడిటరుగా చేరారు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించారు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది.1935లో విశాఖ లోని మిసెస్‌ ఎ ‌వి ఎస్‌ ‌కాలేజీలో  డిమాన్స్ ‌ట్రేటర్‌ ‌గా చేరారు. 1938లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్‌ ఎడిటరుగా చేరారు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు.  1947లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసారు. 1949లో ఒక బాలికను దత్తత తీసుకున్నారు. 1956లో సరోజను రెండవ భార్యగా వివాహమాడారు.

1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించారు. హనుమాన్‌ ‌జంక్షన్లో ఒక ప్రచార సభలో, ఆయన ఆరోగ్యం దెబ్బతిని, కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో, శ్రీశ్రీ, వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి, ఖమ్మంలో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపారు.   శ్రీ శ్రీ ఎన్నో పురస్కారాలు పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి ‘‘రాజా లక్ష్మీ ఫౌండేషను’’ అవార్డు తదితరాలు. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పనిచేసారు. 1970లో ఆయన షష్టిపూర్తి ఉత్సవం సందర్భంగానే అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది. 18 వ ఏట 1928 లో ‘‘ప్రభవ’’ అనే కావ్య సంపుటిని ప్రచురించారు. 1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీని మహాకవి చేసింది. తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలు రచించారు. తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను అయన రచించారు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు రాసిన ‘‘తెలుగు వీర లేవరా..’’ అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజతో కలిసి సినిమాలకు మాటలు రాసారు. తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్‌ ‌సినిమా ఆహుతికి శ్రీ శ్రీ మాటలు పాటలు వ్రాశారు.బి.విఠలాచార్యతో పరిచయం కలిగిగాక, అయన కన్నడలో తీసిన కన్యాదానం అనే సినిమాను తెలుగులో కూడా నిర్మించదలచి శ్రీశ్రీని రచయితగా నియమించుకున్నారు. శ్రీ శ్రీ మైసూరులో వుండి ఒక్కరోజులో 12 పాటలు వ్రాశారు.

ఇది ప్రపంచ చలనచిత్ర లోకంలో ఒక రికార్డు!
మనసున మనసై (డాక్టర్‌ ‌చక్రవర్తి) హలో హలో ఓ అమ్మాయి (ఇద్దరు మిత్రులు) నా హృదయంలో నిదురించే చెలి (ఆరాధన)తెలుగువీర లేవరా (అల్లూరి సీతారామరాజు) పాడవోయి భారతీయుడా (వెలుగు నీడలు)  శ్రీ శ్రీ గీతాలలో కలికి తురాయిలు.తెలుగే మన జాతీయ భాష కావాలనేది తన అభిమతం అన్నారు. ఇది భాషా దురభిమానంతో అంటున్న మాటకాదని, తెలుగు భారతదేశం అంతకీ జాతీయభాష కాగల అర్హత గలదని జె.బి.యస్‌.‌హాల్డేన్‌ అన్నారని, సంస్కృత పదాలను జీర్ణించుకున్న కారణంచేత, అటు ఉత్తరాదివారికీ, ద్రావిడ భాషా కుటుంబంలో ఒకటి కావడంవల్ల ఇటు దక్షిణాది వారికీ, తెలుగు నేర్చుకోవడం చాలా సులభమని హాల్డేన్‌ ‌పండితుని వాదనతో శ్రీ శ్రీ ఏకీభవిస్తున్నా నన్నారు.
–  రామ కిష్టయ్య సంగనభట్ల
   9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *