అభివృద్ధి, ప్రగతివైపు అడుగులు

రైతుల అభివృద్ధికి అనేక రకాల చర్యలు
రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాల అమలు
రికార్డుస్థాయిలో 260 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వరి ఉత్పతి
తెలంగాణ అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం
గేమ్‌ఛేంజర్‌గా మహాలక్ష్మి పథకం
యంగ్‌ ఇం‌డియా స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ‌జిష్టుదేవ్‌ ‌వర్మ ప్రసంగం
సభకు హాజరైన విపక్షనేత కెసిఆర్‌

అభివృద్ధి, ప్రగతివైపు తెలంగాణ అడుగులు వేస్తోందని గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌వర్మ ప్రశంసించారు. మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.  తెలంగాణకు రైతులే ఆత్మ అని, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్లే అన్నదాతలు అని జిష్షుదేవ్‌ ‌వర్మ కొనియాడారు. 260 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వరి ఉత్పతి చేసి దేశంలోనే  తెలంగాణ రికార్డు సృష్టించిందని ప్రశంసించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం గవర్నర్‌ ‌ప్రసంగంతో  ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌వర్మ ప్రసంగించారు. తెలంగాణ భౌగోళిక ప్రాంతమే కాదని, ఒక భావోద్వేగ ప్రాంతమని, స్థిరత్వం, దృఢ సంకల్పానికి గుర్తు తెలంగాణ అని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉందని, రైతులకు మద్దతివ్వడం వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దడమే తమ బాధ్యత అని, దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తెలియజేశారు.

రైతులకు రుణమాఫీ చేశామని, ఇదే రైతుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 25.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని, ఎకరానికి రూ.12 వేల చొప్పున రైతులకు అందిస్తున్నామని, రైతు నేస్తం అమలు చేస్తున్నామని, వరికి రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తున్నామని, రైతుల కోసం వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు చేశామన్నారు. గేమ్‌ఛేంజర్‌గా మహాలక్ష్మి పథకం నిలిచిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణి కల్పిస్తున్నామని జిష్ణుదేవ్‌ ‌వర్మ వివరించారు. ఘనమైన సంస్కతి నిలయం తెలంగాణ అని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ప్రజల కోసం గద్దర్‌, అం‌జయ్య వంటి ఎందరో కృషి చేశారన్నారు. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నామని తెలిపారు. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నామన్నారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్‌ అని అన్నారు. ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగుతోందని గవర్నర్‌ ‌వెల్లడించారు. మద్దతివ్వడం, వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. దేశంలోనే ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని.. ఇదే రైతుల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 23.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page