Take a fresh look at your lifestyle.

అబద్దాలు ఎన్నిసార్లు చెప్పినా నిజం కావు

  • బిజెపిని వ్యతిరేకిస్తున్నందుకే మాపై కక్ష
  • ఛార్జిషీట్‌లో తన పేరుపై బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత ట్వీట్‌

‌హైదరాబాదు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : ఎన్నిసార్లు తనపేరు ప్రస్తావించినా అబద్ధం నిజంకాబోదని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బిజెపి నేత కోమటి రెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి వ్యాఖ్యలపై ఎంఎల్‌సి కవిత స్పందిస్తూ…ఛార్జిషీట్‌లో తన పేరు 28 సార్లు రాసినా, 28 వేల సార్లు రాసినా అబద్ధం నిజం కాబోదని కవిత ట్వీట్‌ ‌చేశారు. దిల్లీ మద్యం కేసులో తాజాగా కవిత పేరును ఛార్జ్‌షీట్‌లో ఇడి చేర్చడంపై నిజం నిలకడ వి•ద తేలుతుందని…‘ట్రూత్‌ ‌విల్‌ ‌ప్రివెయిల్‌’ అనే యాష్‌ ‌ట్యాగ్‌ను ఆమె జత చేశారు.

మాట జారకు రాజగోపాల్‌ అన్న ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం ఎప్పుడు నిజం కాదన్నారు. కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ‌మాణికం టాగూర్‌ ‌చేసిన విమర్శలపై కూడా కవిత ఘాటుగా స్పందించారు. తనపై వొచ్చిన నిందలన్నీ బోగస్‌ అని, తప్పు అని ఆమె ట్విట్టర్‌లో వివరించారు. రైతుల వ్యతిరేక విధానాలు, పెట్టుబడిదారుల అనుకూల విధానాలను తన అధినేత సిఎం కెసిఆర్‌ ‌లేవనెత్తడంతో తమపై రాజకీయ కక్ష వేధింపులకు బిజెపి పాల్పడుతుందన్నారు.

Leave a Reply