అన్న యోజన బియ్యం పంపిణీలో విఫలం

  • లబ్దిదారులకు అందకుండా తెలంగాణ నిర్లక్ష్యం
  • రాష్ట్ర ప్రజా పంపిణీ శాఖ తీరుపై కేంద్రం ఆగ్రహం
  • మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలోనూ విఫలం
  • అందుకే సెంట్రల్‌ ‌పూల్‌లోకి బియ్యం సేకరణ నిలిపివేత

న్యూ దిల్లీ, జూలై 20 : తెలంగాణపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. గరీబ్‌ ‌కళ్యాణ్‌, అన్న యోజన పథకం బియ్యం పంపిణీలో రాష్ట్రం విఫలమైందని, ఏప్రిల్‌-‌మే నెలల కోటా 1.90 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల బియ్యాన్ని..తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నా లబ్దిదారులకు అందకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లను అదుపు చేయడంలో తెలంగాణ సర్కార్‌ ‌విఫలమైందని, స్టాండర్డ్ ఆపరేటింగ్‌ ‌ప్రొసీజర్‌ అమలు చేయలేదని ఆరోపించింది. అందుకే సెంట్రల్‌ ‌పూల్‌లోకి బియ్యం సేకరణ నిలిపివేసినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆ పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. ఈ పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వమే సృష్టించిందని విమర్శించింది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం మండిపడింది.

కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనే విషయాన్ని గుర్తించామని పేర్కొంది. 40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచులు మాయమయ్యాయని, 593 మిల్లుల్లో లెక్కించడానికి వీల్లేకుండా ధాన్యం సంచులు నిల్వచేశారని కేంద్ర అధికారులు పేర్కొన్నారు. ఈ లోపాలు సరిదిద్దుతామన్న రాష్ట్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని, అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోలేదని అన్నారు. వీటన్నిటిపై ఎఫ్‌సీఐకి తెలంగాణ సర్కార్‌ ‌రిపోర్ట్ అం‌దజేయాలన్నారు. నివేధిక ఇస్తే సెంట్రల్‌ ‌పూల్‌ ‌సేకరణ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అధికారులు అన్నారు. 40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచులు మాయమవడాన్ని గుర్తించామన్న కేంద్రం..డిఫాల్టయిన మిల్లర్ల జాబితాను మార్చి 31న తెలంగాణ ప్రభుత్వానికి పంపించామని వెల్లడించింది.

అయితే మళ్లీ మే 21న 63 మిల్లుల్లో 1,37,872 బియ్యం సంచులు మాయమైన అంశం వెలుగులోకి వొచ్చిందని, 593 మిల్లుల్లో లెక్కించడానికి వీలు లేకుండా ధాన్యం సంచులను నిల్వచేశారని పేర్కొంది. లోపాలను సరిదిద్దుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందని తెలిపింది. పై కారణాలతో సెంట్రల్‌ ‌పూల్‌ ‌సేకరణ నిలిపివేయాల్సి వొచ్చిందని, వీటిపై యాక్షన్‌ ‌టేకెన్‌ ‌రిపోర్టును తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి అందజేయాలని ఆదేశించింది. ఆ తరువాత సెంట్రల్‌ ‌పూల్‌ ‌సేకరణ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page