ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : కల్వకుర్తి అసెంబ్లీ జనరల్ స్థానాన్ని ఎస్టీలకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలు దీనికి తమ సహకారం అందించాలని పలువురు గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమనగల్లు పట్టణంలోనీ సేవాలాల్ గుట్ట దగ్గర కల్వకుర్తి తాలూకాలోని ముఖ్య గిరిజన నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం లో లంబాడి గిరిజన సోదరులు ఓట్ల శాతం దాదాపు 50 వేలు ఉన్నందున కల్వకుర్తి నియోజకవర్గం అన్ని రాజకీయ పార్టీలు ఎస్టీ అభ్యర్థులకు కేటాయించాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. లేనియెడల పార్టీలకు అతీతంగా వారి పదవులకు జడ్పిటిసిలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్, ఎంపిటిసిలు సర్పంచులు వార్డ్ నెంబర్లు జాతి కోసం తమ పదవులను సైతం లెక్కచేయకుండా రాజీనామా చేయడం జరుగుతుందని గిరిజన నాయకులు తెలిపారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, జడ్పిటిసిలు జర్పుల దశరథ్ నాయక్, అనురాధపత్య నాయక్, ఎంపీపీ అనిత విజయ్, కమ్లి మోత్య నాయక్, ఎంపీటీసీలు, సర్పంచులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు మల్లేష్ నాయక్, మన్య నాయక్, కృష్ణ నాయక్, రెడ్డి నాయక్, సురేష్ నాయక్, ధన్య నాయక్, బాలు నాయక్, మల్లేష్ నాయక్, రవి రాథోడ్, జైపాల్, నరేష్, శ్రీధర్, నరసింహ, ప్రశాంత్, పద్మనాయక్, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.