*గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ యన్ సి రాజమౌళి
గజ్వెల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని మున్సిపల్ చైర్మన్ యన్ సి రాజమౌళి అన్నారు. గజ్వేల్ లో శుక్రవారం స్థానిక ఆర్యవైశ్య నాయకులు అత్తెల్లి కిషన్,శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాదాపు 400 మందికి అన్నదానం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆకలిగా ఉన్న వారికి అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని అమవాస్య ముందు రోజులు పితృపక్షం రోజుల్లో అన్నదానం నిర్వహిస్తే పూర్వీకుల ఆత్మ శాంతిస్తుందని పురాణాలు చెబుతున్నాయని కీర్తిశేషులు అత్తెల్లి శంకరయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు అత్తెల్లి కిషన్, శ్రీనివాస్ అన్నదానం నిర్వహించారని అన్నారు. అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పుణ్యం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్, సిద్ధి బిక్షపతి, నంగునూరి సత్యనారాయణ, అత్తెల్లి లక్ష్మయ్య, కొమరవెళ్లి శంకరయ్య, అయిత సత్యనారాయణ, తోట బిక్షపతి, శివకుమార్, జూలూరి నర్సింలు, జూలకంటి ప్రభాకర్, దోమకొండ సురేందర్, సతీష్, కల్లూరి సత్యనారాయణ, ఉమేష్, వెంకటేష్, దుబకుంట లచ్చలు, సిద్దేశ్వర్, కైలాస ప్రశాంత్, గందే సంతోష్, తదితరులు పాల్గొన్నారు.