ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 27 : కడ్తాల్ మండల పరిధిలో నిరుపేద కుటుంబీకురాలు బోల బాలమణి కుమార్తె అనుష వివాహానికి జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.10వేల ఆర్థిక సహాయాన్ని జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ స్థానిక నాయకులతో కలిసి బాలామణికి అందించారు. అదేవిధంగా కడ్తాల మండల కేంద్రానికి చెందిన నార్ల కంటి మల్లేష్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఆయన మల్లేష్ ఇంటికి వెళ్లి మల్లేష్ కు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.5. వేల ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా వైస్ ఎంపీపీ ఆనంద్ రూ.5వేలు సర్పంచ్ లక్ష్మీ నరసింహ రెడ్డి రూ.5వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమితి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్, వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ లక్ష్మి నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, డైరెక్టర్ లాయక్ అలీ, నాయకులు లక్షణాచారి, వెంకటేష్, శ్రీను, చంద్రయ్య, రాజు, వెంకటయ్య, రమేష్ నాయకులు పాల్గొన్నారు.
అనుష వివాహానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చేయూత
