Take a fresh look at your lifestyle.

అధికారంలోకి రాగానే వరంగల్‌ ‌డిక్లరేషన్‌ అమలు

కెసిఆర్‌ను దంచుడే..వొచ్చే యేడు దించుడే
రైతులు చేయిచాచి అడుక్కునే పరిస్థితి రానీయం
అక్కంపేటకు రాహుల్‌ ‌గాంధీని తీసుకొస్తాం
ప్రొ।। జయశంకర్‌ ‌స్వగ్రామంలో రచ్చబండలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి
ధరణి పోర్టల్‌ ‌వల్ల రైతులకు ఇబ్బందులు : కొమురవెల్లి రచ్చబండలో పొన్నాల
కరీంనగర్‌ ‌జిల్లా తిమ్మాపూర్‌లో రచ్చబండను అడ్డుకున్న టిఆర్‌ఎస్‌

‌హన్మకొండ/హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 21 : కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వరంగల్‌ ‌రైతు డిక్లరేషన్‌లోని అన్ని హావి•లను నెరవేరుస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి తేల్చి చెప్పారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వడం చేతకాని కేసీఆర్‌… ‌రూ. 5 లక్షల బీమా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హావి•లను నెరవేర్చని కేసీఆర్‌ ‌ను దంచుడేనని… వొచ్చే ఎన్నికల్లో అధికారం నుంచి దించుడేనని పేర్కొన్నారు. తమ కార్యకర్తల జోలికొస్తే ప్రగతి భవన్‌ ‌గోడలు బద్దలు కొడతామని హెచ్చరించారు. తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌పై కేసీఆర్‌ ‌కక్ష కట్టారని, అందుకే ఆయన పేరు కాలగర్భంలో కలిసేలా కేసీఆర్‌ ‌కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. శనివారం ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌స్వగ్రామం అక్కంపేటలో నిర్వహించిన రచ్చ బండ కార్యక్రమంలో రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం దళిత వాడను సందర్శించి…సిలువేరు జానీ కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేసీఆర్‌ ‌పాలనలో ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సొంత ఊరు అక్కంపేట నిరాదరణకు గురైందన్నారు.

రాష్ట్రం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన జయశంకర్‌కు కనీసం ఓ విగ్రహాన్ని కూడా కేసీఆర్‌ ‌పెట్టలేదని మండిపడ్డారు. చివరకు కొండా దంపుతులే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. అక్కంపేట గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించిన ఆయన… కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాహుల్‌ ‌గాంధీని గ్రామానికి తీసుకొస్తానని హావి• ఇచ్చారు. జనియర్‌ ‌కాలేజీ, పశువుల దవాఖాన, పేదలకు ఇండ్లు కట్టించడంతో పాటు గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ‌నేతలు కడియం శ్రీహరి, మధుసూదన చారి అక్కంపేటను అది చేస్తాం… ఇది చేస్తాం అంటూ కాలయాపన చేశారే తప్పే చేసిందేవి• లేదన్నారు. వారిద్దరూ తడిగుడ్డతో గొంతు కోసే రకమని రేవంత్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో అన్నదాత తలెత్తుకుని బతికేలా చేస్తామని రేవంత్‌రెడ్డి హావి• ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రంలోనూ రైతులు, దళితులు, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నిండలేదని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొచ్చాక అన్నదాత చేయిచాచి అడిగే అవసరం లేకుండా చేస్తామన్నారు.

రైతు చనిపోతే బీమా వర్తింపజేస్తున్న రాష్ట్రప్రభుత్వం.. పంటలు నష్టపోతే పరిహారం ఎందుకివ్వదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ దళితులు, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నిండలేదని ఆయన ఆక్షేపించారు. రైతులకు కాంగ్రెస్‌ ‌భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిలో గద్దెనెక్కే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో అన్నదాత చేయి చాచి అడిగే అవసరం లేకుండా.. తలెత్తుకుని బతికేలా చేస్తామని హావి• ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కంపేట గ్రామాన్ని దత్తత తీసుకుంటానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి రాగానే అక్కంపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హావి• ఇచ్చారు. అంతకుముందు ’రచ్చబండ’ కార్యక్రమానికి హాజరైన రేవంత్‌రెడ్డికి స్థానిక నేతలు, రైతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఓ రైతు పూరి గుడిసెలో పార్టీ నేతలతో కలిసి భోజనం చేశారు.

ధరణి పోర్టల్‌ ‌వల్ల రైతులకు ఇబ్బందులు : కొమురవెల్లి రచ్చబండలో పొన్నాల

ధరణి పోర్టల్‌ ‌వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని తీసేస్తామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వరంగల్‌ ‌డిక్లరేషన్‌ ‌ద్వారా రైతులు పండించే పంటకు మద్దతు ధర కల్పించడంతో పాటు కౌలు రైతులకు పంట రుణమాఫీ అమలు చేస్తామన్నారు. తెలంగాణలో రైతులు ధాన్యం కల్లాల వద్ద మరణిస్తుంటే.. సీఎం కేసీఆర్‌ ‌మాత్రం పంజాబ్‌ ‌రైతులకు ఆర్థిక సాయం చేయడానికి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం ప్రభుత్వం పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. గతంలో మ్యానిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానాలను కాంగ్రెస్‌ ‌పార్టీ నెరవేర్చిందని, కానీ సీఎం కేసీఆర్‌ ‌మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాలు ఎంత వరకు అమలయ్యామని ప్రశ్నించారు.

కరీంనగర్‌ ‌జిల్లా తిమ్మాపూర్‌లో రచ్చబండను అడ్డుకున్న టిఆర్‌ఎస్‌

‌కరీంనగర్‌ ‌జిల్లాలోని తిమ్మాపూర్‌ ‌మండలం మోగిలిపాలెం గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ ‌పార్టీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురు కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply