అక్షర క్షేత్రంలో నరమేధం

అగ్రరాజ్యం అమెరికాలో
తుపాకి సంస్కృతి పెచ్చరిల్లి
మరో నరమేదాన్ని సాగించింది

ఉన్మాద భూతం జడలు విప్పి
పాఠశాల మీద విషం చిమ్మింది

మనోదౌర్బల్యం వెర్రితలలు వేసి
పసి పిల్లలు ప్రాణాలు బలిగొంది

ఓ సైకో కిల్లర్‌ ‌బడిలోకి చొరబడి
కాల్పులకు తెగబడిన దుర్ఘటన
టెక్శాస్‌ ‌రాష్ట్రాన్ని వణికించింది

చెల్లాచెదురై పడిన మృతదేహాలు
మృతుల తల్లిదండ్రుల రోధనలతో
పాఠశాల స్మశానాన్ని తలపించింది

ఆత్మరక్షణకై తెచ్చుకున్న చట్టాలే
ఆ దేశానికి యమపాశంగా మారి
మరణఘంటికలు మోగిస్తున్నాయ్‌
‌జనాల ప్రాణాలను హరిస్తున్నాయ్‌

ఈ ‌తుపాకి హింస కొత్తేమి కాదు
అలాగని చివరిది కూడా కాబోదు

ఇపుడు మొక్కుబడి చర్యలతో
ఆరిన జ్ఞాన జ్యోతులు వెలగవు

జాతీయ జెండా అవతనంతో
ఉన్మాద జాడ్యం కడతేరిపోదు

ఇప్పటికైనా..
ప్రపంచ దేశాలు సమైక్యమై

ఈ తుపాకి కల్చర్‌ ‌కట్టడికి
కఠినచట్టాలు రూపొందించి

పటిష్టంగా అమలు పరిస్తేనే
భావితరాల భవితవ్యం భద్రం
మానవాళి అస్తిత్వం సురక్షితం

( టెక్సాస్లో  సైకో కాల్పులకు బలైన వారికి నివాళి అర్పిస్తూ…)
– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page