రాజ్యాంగ స్ఫూర్తి అర్థం చేసుకున్న పాలకులు లేరు:మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 23: దేశంలో అంబేడ్కర్ ఆశయాలు అమలు కావడం లేదని, రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకున్న పాలకులు దేశంలో లేరని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. ఉన్నత న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం’’ అంశంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల సంఘాల ప్రతినిధులు పాల్గొనగా ముఖ్యఅతిథిగా ఈటల మాట్లాడుతూ.. బీసీలకు శాసనసభ, శాసన మండలి, పార్లమెంటులో రిజర్వేషన్లు లేవని, న్యాయవ్యవస్థలో కూడా వివక్ష కొనసాగుతుందన్నారు. ఒక్కో కులం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రిజర్వేషన్ ఉంది.. కులాల మీద లోతుగా అధ్య యనం జరగడం లేదు. అంబేడ్కర్ స్ఫూర్తి దేశంలో అమలు కావడంలేదు. రాజ్యాంగ స్ఫూర్తి అర్థం చేసుకున్న పాలకులు లేరు.
మెరిట్ లెస్ రూలర్స్ దేశాన్ని పాలించారు. సమసమాజం కోసం బిఆర్ అంబేడ్కర్ కలలుకన్నారు. కానీ 75 ఏళ్ల తరువాత ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోరడం, ఇంత మెరిట్ ఉన్నా మా వాటా ఎందుకు లేదు అని మనమంతా గళమెత్తే దుర్మార్గ పరిస్థితి ఎందుకు వొచ్చింది. అని ప్రశ్నించారు. మోదీ ఓబీసీ ప్రధాన మంత్రి అయినప్పుడు ఏవేవో మాట్లాడారు. కానీ సంకీర్ణ యుగంలో మూడవ సారి అధికా రంలోకి వొచ్చారు అంటే ఏమనాలి. ఇది మెరిట్ కాదా ? ఆకలి దుఃఖం నుంచి వొచ్చినవాడు ఉంటే ప్రజలకు న్యాయం జరిగింది కాబట్టి మళ్ళీ ప్రధాని అయ్యారు. ఆకలి అనుభవించిన ఐఏఎస్ అధికారి దగ్గరికి వెళితే .. ప్రజల కోసం పరిష్కారం చూపుతారు. అదే బాధ తెలియని అధికారి కేవలం రూల్స్ మాత్రమే చెప్పి పంపిస్తారని ఈటల రాజేందర్ అన్నారు. న్యాయమూర్తుల నియామకంలో కుల వివక్ష, కుటుంబ నియామకాల వ్యవస్థ మిగతా అన్నిటిలోకంటే ఎక్కువ ఉందన్నారు.మన వర్గాలవారు సమాజాన్ని మోస్తున్న వారు..
సమాజానికి అన్నం పెడుతున్నవారు. బీసీ బీ, బీసీ డిలో ఓపెన్ కాంపిటేషన్ కంటే ఎక్కువ ఉంది. హక్కుల కోసం కొట్లాడాలన్నారు. అడ్వకెట్లు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తీరు మర్చిపోలేనిదన్నారు. అడ్వకెట్లు కు ఉపాధి లేకుండా పోతుందని,కుటుంబాలను పోషించే పరిస్థితి లేకుండా పోయింది. వీరికి ఐదేళ్లవరకు స్టైఫెండ్ అందించాలి. వైద్య బీమా అందించాలని ఈటల రాజేందర్ కోరారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 256 మంది న్యాయమూర్తులు నియ మితమైతే.. అందులోబీసీ 4, ఎస్సీ 5, ఎస్టీ 1, మహిళలు 11 మంది మాత్రమే అయ్యారు. 97 శాతం మంది అగ్రవర్ణాలు, 2.9 శాతం మంది బీసీ ఎస్సీలు నియామ కమయ్యారు.తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు హైకోర్టు జడ్జీలుగా 211 మంది నియా మకాలు జరిగితే, ఇందులో 155 మందిని బార్ నుండి ఎంపిక చేసారు. అందులో అగ్రవర్ణాల నుండి 155 , ఎస్సీ 5, ఎస్టీ 1, బీసీ 16, మైనారిటీలు 9 మంది నియమించబడ్డారు. న్యాయస్థానాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించాలి. అందుకు అనుగు ణంగా చట్టాలను రూపొందించాలని ఈ సమావేశం తీర్మానించింది.