Take a fresh look at your lifestyle.

అం‌దరికి ఆరోగ్యమే ప్రభుత్వ సంకల్పం .. సిఎం కేసీఆర్‌ ‌ధ్యేయం..

  • జాతీయ ఆరోగ్య సూచికల్లో గణనీయ ప్రగతి
  • 3 అంచెల వైద్యాన్ని 5 అంచల వ్యవస్థగా విస్తరణ
  • ప్రజల ముంగిటకే ప్రాథ•మిక వైద్యం
  • పేదలకు చేరువగా అత్యాధునిక సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్యం
  • రోజుకి 25 వేల నుంచి 30 వేల మందికి ప్రభుత్వ వైద్య సేవలు
  • ‘కంటి వెలుగు’ ద్వారా ఇప్పటి వరకు 63.82 లక్షల మందికి కంటి పరీక్షలు  
  • 11.40 లక్షల మందికి ఉచిత రీడింగ్‌ ‌గ్లాసెస్‌ అం‌దజేత
హైద్రాబాద్‌, ‌మార్చి 06 : సర్వజనుల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కంటి వెలుగు పథకాన్ని తెచ్చింది. ఈ పథకాన్ని జనవరి 19 నుంచి జూన్‌ 15 ‌వరకు 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్‌ ‌లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పలు శాఖల అధికారులతో కలిసి శిబిరాల నిర్వహణకు ముందుగానే ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు  రాష్ట్ర వ్యాప్తంగా  ముందస్తు ప్రణాళికలతో, నిరంతర పర్యవేక్షణ, రోజువారి సమీక్షలు, విశ్లేషణ, వీడియో కాన్ఫరెన్స్, ‌సమావేశాలతో ఎప్పటికప్పుడు లోటుపాట్లు సవరించు కుంటూ కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా నిర్వహించిన ‘‘కంటి వెలుగు’’ కార్యక్రమం కింద ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల 82 వేల 201 మందికి కంటి పరీక్షలు చేసి దృష్టి లోపం ఉన్న 11 లక్షల 40 వేల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ వైద్యంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు వేలాది రూపాయలు ఆదా అవుతున్నాయి.
దగ్గరిచూపు సమస్యలే అధికం……
అన్ని జిల్లాలో అత్యధికంగా దగ్గరి చూపు కనిపించక ఇబ్బందిపడే వారే అధికంగా ఉన్నట్లు శిబిరాలలో నమోదవుతున్న లెక్కలు చెబుతున్నాయి. 40 ఏళ్ల వయస్సు పైబడిన చాలామందికి దగ్గర చూపు కనిపించడం లేదని శిబిరానికి వస్తున్నారు. ఇలాంటి వారికి తక్షణమే రీడింగ్‌ ‌గ్లాసెస్‌ అం‌దజేస్తున్నారు. ఇవి కాకుండా కంటి సమస్యలతో వస్తున్న చాలా  మందికి చుక్కల మందులతో పాటు విటమిన్‌ ఏ, ‌డీ,  బీకాంప్లెక్స్ ‌టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. 50 ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా మోతబిందు(కాటరాక్ట్) ‌సమస్యతో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి చికిత్స చేసే సమయాన్ని చరవాణి ద్వారా సమాచారం చేరవేస్తున్నామని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇదివరకే శస్త్ర చికిత్స పూర్తయి ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు.
బస్తీ దవఖానాలకు అధిక ప్రాధాన్యత
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. బస్తీ దవాఖానలు,  కంటి వెలుగు రెండవ విడత   కార్యక్రమం, కెసిఆర్‌ ‌కిట్‌ల పంపిణీ లాంటి, కార్యక్రమాలు నిర్వహించి దేశంలో మరేయితర రాష్ట్రాలు చేపట్టని ఆరోగ్య  కార్యక్రమాలు మన  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.  ప్రైవేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రులను పటిష్టపరిచి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్న ఏకైక  రాష్ట్రం తెలంగాణ మాత్రమే. పట్టణ పేదలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలను అందించే లక్ష్యంతో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో 256 బస్తీ దవాఖానలను ప్రభుత్వం నెలకొల్పింది. వీటి స్ఫూర్తితో ముఖ్యమంత్రి ఆదేశాలతో 141 మున్సిపాలిటీలలో కొత్తగా 288 బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. సుదూర ప్రాంతంలో ఉన్న ప్రజలు  వైద్యం కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్లకుండా, వారికి  వైద్య సేవలు అందుబాటులో ఉంచాలనే  ఉద్దేశ్యంతో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలను ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం పేద వారికి ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించుటకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది.
దీనితో పాటు జిల్లా ప్రధాన ఆసుపత్రుల్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి  రికార్డ్ ‌స్థాయిలో కాన్పులు చేస్తున్నారు. బస్తీ దవాఖానలో అత్యవసర కేసులను కూడా చూసేలా వైద్యులను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా పట్టణ ప్రాంతాల్లో బస్తీ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆరోగ్య విషయంలో ప్రజలు ఎలాంటి రుగ్మతలకు లోనుకాకుండా చూడాలనే దృక్పథ•ంతో ప్రభుత్వం ప్రతి విషయాన్నిని శితంగా గమనిస్తూ  పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. గర్భిణీ స్త్రీలు ఏ సమయంలో ఎటువంటి వైద్యం తీసుకోవాలి, వాక్సిన్‌ ‌వేసుకోవాలో, ఎలాంటి మందులు వాడాలి అనే అవగాహన నిమిత్తం కార్డులు కూడా అందజేస్తున్నారు. మధుమేహ వ్యాధి, బిపి పేషంట్లకు కిట్‌లు అందజేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది, పేద, మధ్యతరగతి ప్రజలకు  వైద్యాన్ని మరింత చేరువలోకి తీసుకువచ్చేందుకు బస్తీ దవాఖానాను ఏర్పాటు చేసింది. ఉచిత వైద్యం  కోసం దూరం వెళ్లే శ్రమ లేకుండా  ప్రజల ఆవాసాల మధ్యలోనే బస్తీ దవాఖానాలను  ఏర్పాటు చేసి మెరుగైన  సేవలను అందించేందుకు తగిన వసతులు కల్పించడం జరిగింది. ఇంకా మెరుగైన చికిత్స కొరకు అవసరమైన ఏర్పాట్లను చేయడం అవుట్‌ ‌పెషేంట్‌ ‌సేవలు,  స్వల్పంగా అనారోగ్యం బారిన పడిన వారికి తక్షణ వైద్య చికిత్స, టీకాలు, కుటుంబ నియంత్రణ, వైద్య పరంగా కౌన్సిలింగ్‌, ‌తదితర సేవలు అందించడం  జరుగుతుంది.

image.pngజాతీయ ఆరోగ్య సూచికలలో రాష్ట్రం గణనీయ ప్రగతి
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు ఆధ్వర్యంలో అందరికి మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ పయనిస్తున్నది. ప్రణాళికాయుతంగా ప్రభుత్వం అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలుతో జాతీయ ఆరోగ్య సూచికలలో రాష్ట్రం గణనీయ ప్రగతి సాధించింది.ఈ తేడా 2014తో పోల్చితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక లక్ష ప్రసవాలకు 2014లో 92 ఉన్న మాతృమరణాలు, 2022 నాటికి 56కు తగ్గాయి. 2014లో 39 ఉన్న శిశుమరణాలు, 2022 నాటికి 23కి తగ్గాయి. 2014లో 5 సంవత్సరాలలోపున్న పిల్లల మరణాలు 41 ఉంటే, 2022 నాటికి ఆ సంఖ్య 30కి పడిపోయింది. అదే పీరియడ్‌లో 25 ఉన్న బాలింత మరణాలు 16కు తగ్గాయి. ఇమ్మ్యూనైజేషన్‌ ‌వాక్సిన్‌ ‌విషయానికి వస్తే 2014లో 68 శాతం ఉంటే, 2022 నాటికి 100శాతంకు చేరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 2014లో 30 శాతం ఉంటే, 2022 నాటికి 56 శాతం పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల సంఖ్య 98 శాతంకు పెరిగింది.

అన్ని ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి కంటే మెరుగ్గా ఉంది. కేంద్ర ప్రభుత్వమునకు చెందిన ‘‘నీతి ఆయోగ్‌’’ ‌విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచిల్లో తెలంగాణ రాష్ట్రం కేరళ, తమిళనాడు తర్వాత 3వ స్థానానికి చేరింది. తలసరి ప్రభుత్వం చేస్తున్న వైద్యఖర్చుల్లో రూ.1,698 లతో హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌కేరళ తర్వాత తెలంగాణ రాష్ట్రం నిలిచింది.ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాల అమలులో మొదటి స్థానంలోనూ, నాన్‌ ‌కమ్మునికబుల్‌ ‌వ్యాధుల స్క్రీనింగ్‌లో 2వ స్థానంలో నిలిచింది. కరోనా నియంత్రణతో పాటు కోవిడ్‌ ‌వాక్సినేషన్‌ ఇవ్వడంలో తెలంగాణ ముందు నిలిచింది. వైద్య సదుపాయల విస్తరణ, నిరంతర మానిటరింగ్‌తో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ పథకాలు-కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ‌కెసిఆర్‌ ‌కిట్‌, ఆరోగ్య లక్ష్మి, పథకాల సమ్మిళిత ఫలితాలే జాతీయ స్థాయిలో తెలంగాణ సాధించిన ఆరోగ్య సూచికలుగా పేర్కొనవచ్చు.

గతంలో మూడు అంచెలు-ప్రాథ•మిక సేవలకు ప్రాథ•మిక ఆరోగ్య కేంద్రాలు, ద్వితీయ స్థాయి సేవలకు జిల్లా ఆసుపత్రులు, స్పెషలిటీ సేవలకు మెడికల్‌ ‌కాలేజీలుగా ఉన్న వైద్య సేవలు వ్యవస్థకు అదనంగా ప్రివేంటివ్‌ ‌సేవలకు బస్తీ/పల్లె దవాఖానాలు, సూపర్‌ ‌స్పెషలిటీ వైద్య సేవలకు టిమ్స్‌లతో 5 అంచెలు వ్యవస్థగా మార్చి ప్రజల ముంగిటకే ప్రాథ•మిక వైద్యాన్ని, పేదలకు అందుబాటులోకి సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్య సేవలను తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది.

గతంలో క్షేత్ర స్థాయిలో వ్యాధులను గుర్తించే ప్రివేంటివ్‌ ‌సేవలు అందించే వ్యవస్థ లేదు. అలాగే అత్యాధునిక సూపర్‌ ‌స్పెషలిటీ వైద్య సేవలు అందించే టిమ్స్ ‌లాంటి ప్రత్యేక వ్యవస్థ లేదు. 5 అంచెల వ్యవస్థతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధునిక వైద్య సేవలు, రోగ నిర్దారణ పరికరాలతోపాటు ఐసియు బెడ్స్‌ను  అందుబాటులోకి తేవడం జరిగింది. అలాగే వైద్య భోదన కళాశాలల్లో ఐసియు బెడ్స్‌ను ఏర్పాటు చేశారు.దేశంలోనే మొదటిసారి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రోగనిర్దారణ పరీక్షా కేంద్రాలను నెలకొల్పిన ప్రభుత్వం, వాటి నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నది.గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక సెంట్రల్‌ ‌డయాగ్నస్టిక్‌ ‌లేబరేటరీని ఏర్పాటు చేశారు. మెడికల్‌ ‌సర్వీసెస్‌ ఇ•‌స్ట్రక్చర్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పిన ప్రభుత్వ డయాగ్నస్టిక్‌ ‌కేంద్రాలలో జరుగుతున్న రోగ నిర్దారణ పరీక్షలను మానిటరింగ్‌ ‌చేస్తున్నారు.

కిడ్నీ వ్యాధిగ్రస్తుల సౌలభ్యం కొరకు 42 డయాలసిస్‌ ‌కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పింది. ఈ కేంద్రాల సంఖ్యను 102కు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. డయాలసిస్‌ ‌కేంద్రాలకు రోగులు వచ్చేపోయేందుకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 ఆసుపత్రుల్లో సిటి స్కాన్‌ ‌సేవలు అందుబాటులోకి వచ్చాయి. గుండె సంబందిత శస్త్ర చికిత్సలు నిర్వహించుటకు హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌లలో క్యాథ్‌ ‌ల్యాబ్‌లను ప్రభుత్వం నెలకొల్పింది.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రతి బెడ్‌కు చేస్తున్న ఖర్చును రూ 5,000 నుంచి రూ 7,500లకు పెంచడం జరిగింది. సాధారణ రోగులకు ఇచ్చే డైట్‌ ‌ఛార్జిలను రోజుకు రూ.40 నుంచి రూ.80 లకు పెంచడం జరిగింది. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల నమ్మకం, విశ్వాసం నానాటికి పెరుగుతున్నది. ప్రభుత్వ వైద్యసేవలను పొందుతున్న వారి సంఖ్య గణనీయంగా రోజుకు 25,000-30,000 కు పెరిగింది.

రాష్ట్ర ప్రజలు వైద్య అవసరాలను నెరవేర్చే సంకల్పంతో వైద్య విద్య విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది.  అందులో భాగంగా వరంగల్‌ ‌లో కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం నెలకొల్పింది. తెలంగాణ  ఏర్పడిన 2014 నాటికి తెలంగాణలో ప్రభుత్వపరంగా 5 మెడికల్‌ ‌కాలేజీలు మాత్రమే ఉండేవి. మొదటి దశలో ఒక్కొక్కటి రూ.450 కోట్ల వ్యయంతో కొత్తగా మహబూబ్‌ ‌నగర్‌, ‌సిద్ధిపేట, నల్గొండ, సూర్యాపేట లలో ఏర్పాటుచేసిన వైద్య కళాశాలలు నడుస్తున్నాయి.
ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీ ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. 2021 లో 8 కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది.ఒక్కో దానికి రూ.510 కోట్ల వ్యయంతో సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌ ‌కర్నూల్‌, ‌జగిత్యాల, మహబూబాబాద్‌, ‌కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం లలో మెడికల్‌ ‌కాలేజిలను ప్రారంభించింది.వ్యాధుల నిర్ధారణలో జరుగుతున్న దోపిడీని అరికట్టుటకు 57 రకాల రోగానిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయుటకు తెలంగాణ డయాగ్నస్టిక్స్ ‌ల్యాబ్‌ ‌ను ప్రభుత్వం నెలకొల్పి, ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేసింది.ప్రాథ•మిక స్థాయిలో మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,745 సబ్‌ ‌సెంటర్లను ‘‘పల్లె దవాఖాన’’లుగా అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో అత్యధికులు పేదలే. చికిత్సకొరకు వచ్చిన పేద రోగులు దురదృష్టవశాత్తు చనిపోతే ఆ పార్థివదేహాన్ని సొంతూరుకి తీసుకువెళ్ళుటకు పడే కష్టాలు గురించి వినాలంటేనే భాద కలుగుతుంది. చనిపోయిన వ్యక్తి భౌతికకాయాన్ని గౌరవప్రద•ంగా ఇంటికి చేర్చాలనే ఉద్దేశ్యంతో పార్ధివ వాహాన సేవలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తున్నది. దేశంలో మొదటిసారి ఇటువంటి సేవలను ప్రవేశపెట్టి, రాష్ట్రవ్యాప్తంగా 50 వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.హైదరాబాద్‌లోని 18 ప్రధాన ఆసుపత్రులకు వైద్య సేవలు పొందుతున్న రోగులతో పాటు వచ్చే సహాయకులకు రూ.5/- లకే మూడు పూటలా భోజన సదుపాయం కల్పించబడింది. ఈ పధకం కింద ప్రతి రోజు సుమారు 18,600 మంది రోగి సహాయకులు లబ్ధిపొందుతున్నారు.ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు ఆధ్వర్యంలో ముందుచూపుతో అందరికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించుటకు ప్రభుత్వం చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తున్నది. అదే స్ఫూర్తితో ఆరోగ్య కుటుంబ సంక్షేమ పధకాలు అమలులో ముందున్న రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నది.

– కమిషనర్‌, ‌సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్‌ ‌వారిచే జారీ చేయనైనది.

Leave a Reply