- రాముని సేవలో… నిర్విరామంగా…
- శ్రీరాముని దీవెనతో సుభిక్షంగా ఉండాలి….ఆయురారోగ్యాలు ప్రసాదించాలి
- సిద్ధిపేటలో కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
- 22 ఆలయాలు, ఆరు గంటలు..పట్టణ పుర విధుల్లో దేవుని దీవెనలు.. ప్రజలతో ఆత్మీయ పలకరింపులు…
- బిజీ బిజీగా దేవుని సన్నిధిలో మంత్రి
సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 30 : ‘‘హరీష్ రావు అంటే హాలిడే ఉండదు…పండుగ లేదు..పర్వదినం లేదు..ఫ్యామిలీ అంత కన్న లేదు…పండగ అయిన..ఫ్యామిలి అయిన సిద్దిపేట ప్రజలే ఫ్యామిలీ…సిద్దిపేట ప్రజల మధ్యే తన పండగలు అని మంత్రి హరీష్ రావు మరో సారి నిరూపించారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా గురువారం సిద్దిపేటలోని ప్రధాన ఆలయాలు, పట్టణ పుర విధుల్లో వెలసియున్న పలు ఆలయాల్లో శ్రీ సీతా రామచంద్ర స్వామి కల్యాణోత్సవం లో పాల్గొన్నారు.
రామాలయంలో పూజల్లో..
సిద్ధిపేట పట్టణంలో కొలువైన శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో ఉదయం మున్సిపల్ చైర్మన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.. మధ్యాహ్నం మంత్రి హరీష్ రావు శ్రీ రాముని కల్యాణోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వహకులు మంత్రిని సత్కరించారు.
ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో స్వామి వెండి ఆభరణాలు సమర్పణ…
సిద్దిపేట గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయం తరఫున చేయించిన వెండి ఆభరణాలు మంత్రి హరీష్ రావు స్వామి వారికి సమర్పించారు. అనంతరం స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
22 ఆలయాలు…ఆరు గంటలు…దేవుని దీవెనలు..ప్రజలను పలకరింపుతో మంత్రి హరీష్ రావు
పట్టణంలోని శ్రీనగర్ కాలనీ, పట్టణ హౌసింగ్ బోర్డు కాలనీ, హరిప్రియ నగర్, శివాజీ నగర్ హనుమాన్, గణేష్ నగర్ శ్రీ ప్రసన్నంజనేయ స్వామి, హనుమాన్ నగర్ అంజనేయస్వామి, షిర్డీ సాయి బాబా ఆలయం, గాంధీ నగర్ ప్రసన్నంజ నేయ స్వామి, సంతోష్ నగర్ అష్ట లక్ష్మి నృసింహ స్వామి, సుభాష్ నగర్ దాసంజనేయ స్వామి, కళ్ళకుంట కాలనీ అంజనేయ స్వామి, బాలంజనేయ స్వామి, వడ్డెర కాలనీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి, సీతారాం నగర్ అభయ అంజనేయ స్వామి, ఖాదర్ పురా లోని శ్రీ హనుమాన్ దేవలయం, నాసర్ పుర శ్రీ హనుమాన్ దేవాలయం, పాత గంజి శ్రీ దాసాంజ నేయ స్వామి, శ్రీ రేణుక నగర్ శ్రీ హనుమాన్ దేవాలయం, శ్రీ సీతా రామచంద్ర స్వామి అలయం, నర్సపూర్ గ్రామంలో కల్యాణోత్సవము, మహా శక్తి నగర్ లోని అభయ అంజనేయ స్వామి, శ్రీనివాస్ నగర్‌లోని దాసాంజనేయ స్వామి దేవాలయాలలో హనుమంతుని దర్శించుకుని, శ్రీరామ నవమి పురస్కరించుకుని శ్రీ సీతారాముల స్వామి కల్యాణ మహోత్సవాలో పాల్గొన్నారు. మొత్తంగా 22 ఆలయాలను ఆరు గంటలు సమయంలో తీరిక లేకుండా తిరిగారు. ఇరుకోడ్ బీరప్ప ఉత్సవంలో పాల్గొన్నారు. ఒక వైపు దేవుని దీవెనలు, ప్రజల ఆత్మీయ పలకరింపుతో మంత్రి హరీష్ రావు రోజంతా బిజీ బిజీగా గడిపారు.