నేటి నుండి జనవరి 2 వరకు అధ్యయనోత్సవాలు
22వ తేది గోదావరి నదిలో తెప్పోత్సవం, తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం
భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచందస్వ్రామి దేవస్థానం నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భద్రాద్రి సర్వాంగ సుందరంగ ముస్తాబయ్యింది. ఇందులో భాగంగా ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా రంగులతో తీర్చిదిద్దుతున్నారు. 13వ తేది బుధవారం నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 02వ తేది వరకు ఉత్సవాలు మిధుల స్టేడియంలో, కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వామివారు దశవతారాలలో వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 13వ తేది మత్య్సావతారం, 14కూర్మవతారం, 15వ తేదివరహావతారం, 16వతేది నరసింహవాతారం, 17వ తేది వామనావతారం, 18వ తేది పరశురామారవతారం, 19వ తేది శ్రీరామావతారం, 20వ తేది బలరామావతారం, 21వ తేది శ్రీకృష్ణావతారం, 22వ తేది కల్కి అవతారములో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఇందుకోసం మిధుల స్టేడియం అంతా సుందరంగ తీర్చిదిద్దారు. చాందిని వస్త్రాలతో అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలు అలంకరించారు. 22వ తేది గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించడానికి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసారు. స్వామివారు గోదావరి నదిపై విహరించే హంస వాహానాన్ని కూడా గత 10 రోజుల క్రితమే భద్రాద్రికి తీసుకువొచ్చి సిద్ధం చేస్తున్నారు. అలాగే తెల్లవారుజామున జరిగే వైకుంఠ ద్వారదర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సమయం దగ్గర పడటంతో అధికారులు పనులను వేగవంతం చేసారు. ప్రధానాలయాలతో పాటు అనుబంధ దేవాలయం అయిన పర్ణశాల ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వారదర్శరం కార్యక్రమాలను భక్తిశ్రద్దలతో తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మిధుల స్టేడియంలో బుధవారం జరిగే అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు మత్య్సావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
నేడు ‘‘మత్స్యావతారం’’లో స్వామివారు
భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీవైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా స్వామివారు దశావతారాల్లో భక్తులకు దర్శనంం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే నేడు బుధవారం స్వామివారు ‘‘మత్య్సావతారం’’లో భక్తులకు దర్శమిస్తారు. శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాలలో మొట్టమొదటి అవతారం మత్య్సావతారం. ఈ అవతారానికి సంబంధించిన రెండు గాథలు పురణాల్లో ఉన్నాయి. ఒకటి జ్ఞాన విధులైన వేదాలను బ్రహ్మ నుండి అపహరించి సముద్రంలో దాగివున్న సోమకాసురుని సంహరించడానికై మత్య్సావతారం ధరించి వేదాలను ఉద్దరించడం జరిగింది. రెండవది జలప్రళయం నుండి నావలో ఉన్న వైవస్వత మనువులు, సప్తరుషులును, సృష్టికి అవసరమైన విత్తనాలను, ఔషదాలను రక్షించాడు. ఈ అవతారాన్ని పూజించుట వలన కేతు గ్రహ బాధలు తొలగుతాయి.





