బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రధాని
న్యూ దిల్లీ, మార్చి 23 : సికింద్రాబాద్‌ ‌సవి•పంలో ఉన్న బోయిగూడలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌, ‌ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. స్క్రాప్‌ ‌గోదాములో జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని బాధిత కుటుంబాలకు 2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ప్రధాని మోదీ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, అగ్ని ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *