బిఆర్‌ఎస్‌లో హరీష్‌ కొనసాగడం డౌటే

బిజెపిలోకి పోవడం ఖాయమన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్య
యాదాద్రి, ప్రజాతంత్ర, మార్చి 6 : పార్లమెంట్‌ ఎన్నికల తరవాత బిఆర్‌ఎస్‌లో హరీష్‌ ఉండడం డౌటేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి..కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత హరీష్‌ రావు కూడా ఉండడం డౌటే అని…బీజేపీలోకి పోతారంటూ సంచలన కామెంట్స్‌ చేశారు. బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తుందన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా కొడుకుకు ఇస్తే అల్లుడు పోతాడు…అల్లుడుకిస్తే కొడుకు పోతాడని అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డిని ఎదుర్కునే శక్తి లేకే అసెంబ్లీ రావడం లేదన్నారు.

వారి లాగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకుంటే మిగిలేది నలుగురే అని చెప్పుకొచ్చారు. ప్రధాన మంత్రి రాష్ట్రానికి వొస్తే కలిసి వినతిపత్రం ఇవ్వాలన్నారు. మోదీ జేబులోంచి ఇవ్వడం లేదని..అది ప్రజల సొమ్మే అని అన్నారు. కేసీఆర్‌కు దిక్కులేక ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కాళ్ళు పట్టుకునే పరిస్థితి వొచ్చిందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ గైడ్‌ లైన్స్‌ పూర్తి కాలేదన్నారు. రాహుల్‌ గాంధీ  తెలంగాణ నుంచి పోటీ చేస్తే మోదీ కంటే ఎక్కువ మెజార్టీ వొస్తుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *