బాధ్యత అంటే భారము కాదు
అది గీటురాయి నీ ప్రతిభకు
అది నీ సమర్థతకు అద్దం పట్టు!
రెక్కలు లేని రాకెట్ లో
బాధ్యతల శాటిలైట్ పరుగు!
వయసు పెరిగిన కొలది
ఎత్తుకు ఎదిగిన కొద్దీ
బాల్య కవచాలు ఊడి
బాధ్యతల భుజ కిరీటాలు మొలిచి
ఆశయాల కక్ష్యలో తిరుగు!
బాధ్యత లోనే భద్రత వున్నది
మిన్ను విరిగి మీద పడుతున్నదా!
గ్రహాలు గతులు తప్పుచున్నవా!
కడలి చెలియలికట్ట దాటుతున్నదా!
ప్రకృతి పరిమితులను దాటితేనే
మనిషి బాధ్యత మరిస్తేనే బాధలు!
మనిషి బాధ్యతల వలయంలో
నిరంతరం పరిభ్రమిస్తున్నాడు!
కక్ష్య లేని ఆకాంక్షల లోకంలో
తరం తరం పరిశ్రమిస్తున్నాడు!
బాధ్యత బ్రతుకు తెరువుకు పురికొల్పి
ప్రజాజీవనాన్ని సుఖవంతం చేస్తుంది
ఎట్లావచ్చి పడుతుందో
బాధ్యత సల్లగుండ!
– పి.బక్కారెడ్డి, 9705315250




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల