వాట్సాప్ చానెల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి కార్యాలయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : తెలంగాణ ప్రభుత్వం, ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి అధునాతన సాంకేతిక మాధ్యమాలను, వేదికలను ఉపయోగించుకుంటున్నది. ఇదే కోవలో, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) ‘వాట్సాప్ చానెల్’ ను నేడు ప్రారంభిస్తున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చానెల్ ద్వారా ప్రభుత్వం సీఎంఓ నుండి వెలువడే ప్రకటనలను పౌరులకు చెరవేస్తుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయ వాట్సాప్ చానెల్‌ను(తెలంంగాణ సిఎంఓ) వినియోగించుకోవడం ద్వారా సిఎం కేసీఆర్ వార్తలను ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ఆసక్తిగల వారు ఈ సూచించిన పద్ధతిలో సీఎంఓ చానెల్‌లో చేరవచ్చు : 1. వాట్సాప్ అప్లికేషన్‌ను తెరవండి. 2. మొబైల్‌లో అయితే ‘‘అప్‌డేట్స్’’ అనే విభాగాన్ని ఎన్నుకోండి. డెస్క్ టాప్ అయితే ‘‘చానల్స్’’ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. 3. తర్వాత ‘‘ం’’ బటన్ పైన క్లిక్ చేసి ‘‘ఫైండ్ చానల్స్’’ ను ఎన్నుకోండి.
4. టెక్సట్ బాక్స్‌లో ‘‘తెలంగాణ సిఎంఓ’’ అని టైపు చేసి జాబితా నుండి చానెల్ ను ఎన్నుకోండి. చానెల్ పేరు పక్కన ఒక ఆకుపచ్చని టిక్ మార్క్ ‘‘ఆకుపచ్చటిక్ మార్క్’’ ను నిర్ధారించుకోండి. 5. ‘‘ఫాలో’’ బటన్‌ని క్లిక్ చేసి తెలంగాణ సీఎంఓ చానెల్ లో చేరండి. సీఎంఓ పంపే ప్రకటనలను నేరుగా వాట్సాప్ లోనే చూడండి.
పైన ఇచ్చిన ‘క్యూఆర్ కోడ్’ ను స్కాన్ చేయడం ద్వారా కూడా తెలంగాణ సీఎంఓ వాట్సాప్ చానెల్ లో పౌరులు చేరవచ్చు. ‘తెలంగాణ సీఎంఓ వాట్సాప్ చానెల్’ ను ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం(సీఎం పీఆర్వో) సమన్వయంతో ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం నిర్వహిస్తున్నది.



