ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ఇటీవల గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి కాగా.. త్వరలో గ్రూప్-2 3, 4 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నది. వాటిలో ఉన్న పోస్టులకు తోడు మరికొన్ని పోస్టులు చేరుస్తోంది. గ్రూప్-2లో కొత్తగా ఆరు రకాల పోస్టులు చేర్చగా, గ్రూప్-3 రెండు రకాల పోస్టులు, గ్రూప్-4లో నాలుగు రకాల పోస్టులు చేర్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు తెలిపింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన 55 జీవోలో సవరణలు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా నిర్ణయంతో గ్రూప్-2, 3, 4లో పోస్టులు మరిన్ని పెరిగే అవకాశం ఉన్నది. గ్రూప్-2లో చేర్చిన పోస్టులు ఇలావున్నాయి.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిష్ సర్వీస్),అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర శాఖలకు సంబంధించి),జువైనల్ డిస్టిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ సిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్,అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్,అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు చేరాయి. గ్రూప్-3లో..గిరిజ సంక్షేమ శాఖ అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ లేదా హెచ్ఓడీల్లో ఇదే విధమైన పోస్టులు ఉంటాయి. గ్రూప్-4లో..జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్వైజర్ (మేల్) (జువైనల్ సర్వీసెస్, డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్),మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్,మ్యాట్రన్ (కమిషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్) పోస్టులు చేరాయి.



