ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ ‌పార్టీకి భారీ కుదుపు..

బీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్‌ ‌నేతలు… జిల్లా కాంగ్రెస్‌ ‌ప్రముఖులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌, ‌విద్యార్థి నేతగా పేరున్న కూటూరి మానవతారాయ్‌ ‌మరియు పలువురు సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతలు శుక్రవారం నాడు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌సమక్షంలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. వారికి సీఎం కేసీఆర్‌ ‌గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ, సీనియర్‌ ‌రాజకీయ నేత వూకె అబ్బయ్య దంపతులు, డా. రామచంద్రు నాయక్‌ ‌వారితో పాటు పలువురు కూడా బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *