కౌంట్‌ ‌డౌన్‌ 28 నేటి నుంచి నామినేషన్‌ల స్వీకరణ

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకునేటి నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభం కానుంది.10 న నామినేషన్‌ ‌దాఖలుకు ఆఖరు తేదీ ..ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మరో వైపు రాజకీయ పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ, సీపీఎంల మధ్య పొత్తు కుదరలేదని ..సీపీఎం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాకు తెలిజేసారు. కాంగ్రెస్‌ ‌పార్టీ పొత్తుల ధర్మాన్ని పాటించడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ పర్యటన మూడవ రోజు మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్లను పరిశీలించారు. మంథనిలో అంబటి పల్లి గ్రామ మహిళా సదస్సులో పాల్గొని రాష్ట్రంలో అధికారం లోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రు.2500, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌రు .500 లకు హామీ ఇచ్చారు.
బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌, ‌బాల్కొండ, ధర్మపురి బహిరంగ సభలలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్‌ ‌వారి వల్లే దళితులకు నష్టం జరిగిందనీ దళితులను వోటు బ్యాంకుగా వాడుకున్నారు…దళితులను అంటరానితనంగా చూశారు..వెలివాడల్లో నివసించేలా చూశారు..దళితబంధు నా మానస పుత్రిక..అందరికి దళితబంధు అందేలా చూస్తా…అన్నారు కేసీఆర్‌.‌భారతీయ జనతా పార్టీ 35 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 7న హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఎస్సీ సమ్మేళనం ..11న పరేడ్‌ ‌గ్రౌండ్‌లో పార్టీ బీసీ గర్జనలో పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *