ఎకెజి భవన్‌కు ఏచూరి భౌతిక కాయం

దివంగత నేతకు లెఫ్ట్ ‌నేతల నివాళి
నివాళి అర్పించిన కాంగ్రెస్‌ ‌నాయుకురాలు సోనియా గాంధీ తదితర నేతలు

న్యూదిల్లీ,సెప్టెంబర్‌14: ‌కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని శనివారం ఉదయం 11 గంటలకు ప్రజల సందర్శనార్థం వసంత్‌ ‌కుంజ్‌లోని నివాసం నుండి మూడు దశాబ్దాలుగా పని చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం ఎకెజి భవన్‌కు తరలించారు. దివంగత నేతకు నివాళులు అర్పించేం దుకు సిపిఎం పోలిట్‌ ‌బ్యూరో సభ్యులు, పార్టీ శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, మేధావులు, వివిధ వర్గ, సంఘాల నాయకులు, ప్రజా ఉద్యమాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎకెజి భవన్‌కు చేరుకొని సీతారాంకు నివాళులర్పించారు. కాంగ్రెస్‌ ‌నాయుకురాలు సోనియా గాంధీ, జైరాం రమేష్‌, అజయ్‌ ‌మాకెన్‌, ‌రాజీవ్‌ ‌శుక్లా తదితరులు నివాళులర్పించారు.

 

ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్‌ ‌పవార్‌ ఏకేజీ భవన్‌కు వచ్చి సీతారాం ఏచూరికి నివాళులర్పించారు.కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధప్రదేశ్‌, ‌గుజరాత్‌, అస్సాం, బీహార్‌, ‌దిల్లీ, ఉత్తరప్రదేశ్‌ ‌రాష్టాల్ర సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీల సిపిఎం నేతలు  సీతారాం ఏచూరి భౌతికకాయానికి నివాళులర్పించారు.మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి ఎయిమ్స్ ‌వరకు అంతిమ యాత్ర సాగుతుంది. అనంతరం ఆయన కోరుకున్న విధంగా భౌతిక కాయాన్ని ఎయిమ్స్‌కు కుటుంబ సభ్యులు అప్పగిస్తారు.ఎయిమ్స్ ‌నుంచి జెఎన్‌యుకు తీసుకొచ్చి స్టూడెంట్స్ ‌యూనియన్‌ ‌హాలులో శుక్రవారం సాయంత్రం ఉంచారు. సాయంత్రం 4 గంటల వరకు జెఎన్‌యులో నివాళులర్పించే కార్యక్రమం కొనసాగింది. ఆ తరువాత ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల సందర్శనార్థం వసంత్‌ ‌కుంజ్‌లోని నివాసానికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *