నిధుల మళ్లింపు, అసైన్డ్ భూముల మార్పు జరుగుతుంది
కెసిఆర్ అధికార దుర్వినియోగం చేయకుండా నిఘా పెట్టాలి
సిఇవో వికాస్ రాజ్‌తో కాంగ్రెస్ నేతల భేటీ..వినతిపత్రం అందచేత
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2 : తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో అధికారం దుర్వినియోగం కాకుండా చూడాలని కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను కోరారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి , ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఇతర సీనియర్ నేతలు సీఈవోను కలిసిన వారిలో ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా 4 అంశాలపై ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న జరగబోయే కేబినెట్ భేటీలో కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిలువరించాలని ఈసీని కోరినట్లు తెలుస్తుంది. అలాగే, నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపైనా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
సీఈవోను కలిసిన అనంతరం కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి డియాతో మాట్లాగుతూ…బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదని, ఆ పార్టీకి సంబంధిచిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారని కాంగ్రెస్ నేతలు సీఈవోకు ఫిర్యాదు చేశారు. ‘రైతు బంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారు. సుమారు రూ.6 వేల కోట్లను తమకు నచ్చిన వారికి ఇచ్చేందుకు సర్కారు యత్నిస్తుంది. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్ లోకి మార్చేస్తున్నారు. అసైన్డ్ భూములు ఇతరుల పేర్లపై రిజిస్టేష్రన్ చేయకుండా చూడాలి. ఆ భూముల రికార్డులు మారకుండా చూడాలి.’ అని ఈసీని కోరినట్లు చెప్పారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని, 4 అంశాలపై వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఎన్నికల ఫలితాల వేళ సోమవారం కేబినెట్ భేటీలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా నిలువరించాలని ఈసీని కోరినట్లు ఉత్తమ్ తెలిపారు. ’ఎన్నికల ఫలితాల వేళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆదివారం గెలుపు ధ్రువపత్రాలను మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు తీసుకుంటారు. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరాం.’ అని చెప్పారు. సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదని, రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ టింగ్ ఏర్పాటు చేసి ఉండొచ్చని పేర్కొన్నారు. రైతుబంధు నిధుల దారి మళ్లింపుపై దిల్లీలో సీఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు.
పిసిసి చీఫ్ రేవంత్ ఇంటి వద్ద భారీ భద్రత
పోరాటంలో అండగా నిలిచిన వారికి ట్వీట్ ద్వారా రేవంత్ ధన్యవాదాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2 : టీపీసీసీ అధినేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని తెలవడంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు. గతంలో కంటే ఎక్కువగా పోలీసులను మోహరించారు. ఇక పోలింగ్ అంచనాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వొస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డి ఇంటికి భారీగా తరలివస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే సీఎం అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనే ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన నివాసానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వొచ్చే అవకాశం ఉందని తెలియడంతో ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా భద్రత పెంచినట్టు తెలుస్తుంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాంటూ రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు భయపడకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటంలో కార్యకర్తలంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని కొనియాడారు. వారి కష్టం, శ్రమ వృథా కాలేదని తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో వారందరి పాత్ర మరువలేనిదని..ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని రేవంత్ రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.





