(అ)‌దృశ్య (అ)వాస్తవం!!

అదిగో వంగిన కిరణం కనిపిస్తోందా
అది అదృశ్య శక్తి బరువుకు చిహ్నం
కాలం పలకలుగా పరుచుకుంది ఖాళీలో
అక్కడా ఇక్కడా పైకీ కిందకి నాన్‌ ‌లీనియర్‌ ‌గా
ఘటనలు కూడా జరిగినవి జరగబోయేవి
శూన్యంలో నిల్చున్నాయి డిసేబుల్‌ అయి
అవి స్పష్టతలోకి ఎప్పుడొస్తాయో
రంగుల్లోకి పునరావృతమవుతున్నాయో
లేదా ఒక డెజా వు (ణ్ఘ•్స ఙ•)
కదిలించావో డొమినో ఎఫెక్ట్ ‌కు గురవుద్ది వర్తమానం!
నిన్నటిని నిద్రించెయ్‌ ‌త్వరగా
రేపు ఎలాగో మేల్కొంటావు
సంభావ్యత  వలయంలోనో ఏ పొరల్లోనో
ఇది అనిశ్చితం మత్రమే తప్పా
అది ఇవ్వాళై ఇంకో నిన్నటిలో కలిసేదాకా
కొన్ని మళ్ళీ పేర్చుకుంటూ వచ్చుంటావ్‌ ‌రాత్రి కాడికి…
అలా ఎన్నో చీకటి వెలుగుల లేయర్స్ ‌మ్యూజిక్‌ ‌నోట్స్ ‌లా…
మరీ దగ్గరికెళ్తే తప్పా దృగ్గోచరం అవ్వవు శృంగాలు ద్రోణులు…
శబ్దాలు చిన్నవయ్యుంటాయ్‌ ‌మ్యూట్‌ ‌లో
త్రిడీలోనో వర్చువల్‌ ‌రియాల్టీగానో
ఇక చూడొచ్చు స్వయంగా-
కరప్టెడ్‌ ఆటోబయోగ్రఫికల్‌..!
‌కొన్ని మిస్సింగ్స్ ‌కొన్ని యాడింగ్స్ ఇం‌కొన్ని డామేజెస్‌
‌మనం అందులోకి తీసుకుపోబడుతున్నాం
స్థలం కూడా అద్దెకు తెచ్చుకోవచ్చు ఊహల్లో నైనా
కొన్ని భావాలను కొన్ని వికారాలను పొందనూవచ్చు
రహస్యంగా అవి ఎక్కడో రికార్డ్ అవుతుంటాయేమో
మార్ఫింగ్‌ ‌హ్యాకింగ్‌ అయి మనం ముక్కలవుతాం..!
ముక్కలు చెక్కలై-
మనం కాని మనం
మనలా ఉండే మనం
మనకే మనచే పంపబడతాం
మన ప్రమేయం లేకుండానే నగ్నంగా..!!
‘అయ్యో ఇంత పనిచేసానా..’ అనుకునేలోపే
డిస్పాచ్‌ ‌చేయబడతావు చాల చోట్లకు
‘‘నౌ యూ ఆర్‌ ‌ది డిస్పాచ్డ్ ‌బీఇంగ్‌!’’
ఏ ‌ఫోల్డర్స్ ‌లోనో లింక్స్ ‌లోనో హైపర్‌ ‌లింక్స్ ‌గానో…
వెతుక్కో ఇక ఆ సముద్రపు జంక్‌ ‌లో..!!!
    – రఘు వగ్గు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *