హైదరాబాద్ సహా 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్

 – క్యుములో నింబస్ ప్రభావంతో భారీ వర్గాలు 
– వాతావరణ శాఖ వెల్లడి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5 : క్యుములోనింబస్ మేఘాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజులపాటు వర్గాలు కురిసే అవ కాశమున్నదని వెల్లడించింది. హైదరాబాద్ సహ 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా కామారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫా బాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువొచ్చు. కాగా, గడిచిన 24 గంటల్లో 4 మండలాల్లో 11.56 సెంమీ నుంచి 20.44 సెం.మీ మధ్య వర్షపాతం నమోదైంది. 6.45 సెం.మీ నుంచి 11.55 సెం.మీ మధ్య 40 మండలాల్లో, 1.56 సెం.మీ నుంచి 6.44 సెం.మీ మధ్య 281 మండలాల్లో వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా పిట్లంలో 14.11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *