-సమ్మక్క జాతరలో కవిత ఆవేదన
ములుగు, ప్రజాతంత్ర, జనవరి 30: తెలంగాణ ఏర్పడిన తర్వాత 12 ఏండ్లలో ఏమీ సాధించుకోలేక పోయామని మాజీ ఎమ్మెల్సీ,తెలంగాణ జాగ తి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో వేటిని కూడా సంపూర్ణంగా సాధించుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కూడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేడారంలో సమ్మక్క, సారలమ్మను ఆమె దర్శించుకున్నారు. అంతకు ముందు గట్టమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిలువెత్తు బంగారాన్ని అందించి మొక్కులు తీర్చుకున్నా రు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అమ్మవార్లు వారి జాతి కోసం చేసిన పోరాటం చరిత్రాత్మకమని చెప్పారు. ఇవాళ తెలంగాణ జాతి కోసం అందరం నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. మన హక్కులను సాధించుకునేందుకు సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. తల్లుల దయతో తెలంగాణ బాగుండాలని కోరుకుంటున్నట్టు ఆమె తెలిపారు.
జాతరను సందర్శించుకున్న తలసాని 
మేడారంలో సమ్మక్క, సారక్క జాతర వైభవంగా కొనసాగుతున్నది. జాతర అమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ రాష్టాల్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం మేడారం జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క, సారక్కను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. బంగారం సమర్పించి అమ్మవార్లను వేడుకున్నారు. జాతరలో మంత్రి సీతక్క ఎమ్మెల్యేను ఆప్యాయంగా పలకరించారు. సీతక్క వారికి అమమవారి దర్శనం చేయించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





