మంత్రి సీతక్కకు వీవీజీఎఫ్‌ సదస్సుకు ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కకు అంతర్జాతీయస్థాయి మహిళా నాయకత్వ వేదిక ‘వైటల్‌ వాయిసెస్‌ గ్లోబల్‌ ఫెలోషిప్‌(వీవీజీఎఫ్‌) సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం అందింది. పపంచవ్యాప్తంగా మహిళా నాయకత్వం, సామాజిక మార్పు, ప్రజా సేవా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న నాయకులను ఈ సదస్సుకు ఆహ్వానిస్తారు. మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం సీతక్క చేసిన కృషిని గుర్తిస్తూ నిర్వాహకులు ఈ గౌరవాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క నెదర్లాండ్స్‌కు ఆదివారం చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న ఈ సదస్సులో ప్రపంచంలోని పలు దేశాల మహిళా నాయకులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలను, గ్రామీణాభివృద్ధి చర్యలను అంతర్జాతీయ వేదికపై ఆమె వివరించనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page