– విచారణలో తేల్చిన పోలీసులు
– యూట్యూబర్ల అసత్య కథనాలపై మండిపడ్డ సోదరుడు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: విజయశాంతి రెడ్డి, తన ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు . డిప్రెషన్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్దారించారు. తల్లి మాటను తూచా తప్పకుండా పాటించే పిల్లలు ఆమెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒంటరిగా ఉండడం వల్ల ఆమె తీవ్ర ఒత్తిడికి లోనయ్యిందని తేల్చారు. ఆమె ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేసి,ఈ నిర్ణయానికి వచ్చారు. సాప్ట్‌వేర్ ఇంజినీర్ విజయశాంతి రెడ్డి ఆత్మహత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసుపై మృతురాలి సోదరుడు చిరంజీవి రెడ్డి స్పందించారు. యూట్యూబ్ ఛానల్స్ తమ ఇష్టానుసారంగా థంబ్‌నెయిల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరి మరణానికి తాము కారణం కాదని, కుటుంబ సభ్యులంతా ప్రేమతో ఉండేవారమని వివరించారు. తమ చెల్లి మరణానికి తాము ఎలా కారణం అవుతాం? తాము విజయను, వారి పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్లం. అల్లుడు, కోడలు నా చేతుల మీదుగా పెరిగారు. తమకు ఎలాంటి రహస్యాలూ లేవు. తల్లికి, నాకు ఏదో రహస్యం తెలుసని ప్రచారం చేయడం సరికాదు’ అని ఆయన అన్నారు. తమ కుటుంబంపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న కొన్ని ఛానల్స్‌పై పరువు నష్టం దావా వేస్తామని చిరంజీవి రెడ్డి హెచ్చరించారు. మమ్మల్ని మానసికంగా బాధపెట్టే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయని, ఇలాంటి ఛానల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. సమాజానికి మేలు చేసే వార్తలు ఎన్నో ఉన్నాయని, అలాంటి వాటిని ప్రచురించాలని విజయశాంతి రెడ్డి సోదరుడు సూచించారు. బాధలో ఉన్న తామూ భాదితులమే అన్నారు. ఒక ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడంతో కక్షపూరితంగా తప్పుడు థంబ్‌నెయిల్స్‌తో వార్తలు ప్రచురిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ విచారణకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని, పోలీసులు ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేస్తున్నారని చిరంజీవి రెడ్డి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




