దర్యాప్తు సంస్థల నిష్పాక్షికతపై నమ్మకం కలిగించాలి!

 స్వయం ప్రతిపత్తి మాత్రమే దీనికి పరిష్కారం…

కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీలను బలోపేతం చేయడంతో పాటు నిజాయితీగా పనిచేసే సంస్థలుగా తీర్చిదిద్దాల్సి ఉంది. మెరికల్కెన అధికారులను వీటికి కేటాయించాలి. ఎలాంటి కేసున్కెనా ఛేదించి ఫలితం చూపేలా తయారు చేయాలి. దేశంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిం చాల్సి అవసరం ఉంది. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఈడీ, సిబిఐలు అంటే భయం లేకుండా పోయాయి. వీటి సమర్థతపై ఉన్న అనుమానాలే దీనికి కారణమని వేరుగా చెప్పనక్కరలేదు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం చిత్తశుద్దిని చాటుకోవాల్సి ఉంది. కేవలం రాజకీయ కక్ష తీర్చుకునేందుకు వీటిని ఉపయోగి స్తున్నారన్న ఆరోపణల నుంచి బయటపడాలి. ఇప్పటివరకు ఏ ఒక్క కేసులోనూ నిగ్గు తేల్చిన దాఖలాలు లేవు. మద్యం కేసు కావొచ్చు..ఇతర అవినీతి కేసులు కావొచ్చూ..ఏవీ ముందకు సాగడం లేదు. అంతెందుకు వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసును ఆరేళ్లయినా నిగ్గు తేల్చలేదు. అందుకే దర్యాప్తు సంస్థల ప్రతిష్టను పెంచేందుకు చిత్తశుద్దితో పనిచేయాలి. ఇకపోతే దిల్లీ  ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విమర్శలకు పదును పెడుతున్నారు. బిజెపికి కేజ్రీవాల్‌ సవాళ్లు విసురుతున్నారు. ఇదే క్రమంలో  దిల్లీ సిఎం అతిషిపైనా కేసులు తప్పకపోవొచ్చన్న ప్రకటన చేశారు.

బిజెపి కేసులతో లొంగదీసుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. నిజానికి బిజెపి ముందు ఇప్పుడు  దిల్లీ  ఎన్నికలు తప్ప మరో ఎన్నిక లేదని చెప్పాలి.  దిల్లీలో మరోమారు అధికారం కోసం కేజ్రీవాల్‌ చెమటోడుస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే అంత సులభంగా విజయం దక్కక పోవొచ్చు. ఆప్‌కు చెందిన అనేకులు పార్టీని వీడి బిజెపిలో చేరారు. అయితే  రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యంగా మోదీ  సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడానికి బరితెగిస్తోందన్న విమర్శలు వొస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్నవారిని ఒక రకంగా లేనివారిని మరో రకంగా చూస్తున్నారు. జగన్‌, కెసిఆర్‌ విషయంలో మాత్రం బిజెపి ఎందుకనో వెనకడుగు వేసింది. ఈ ఇద్దరిపైనా అవినీతి ఆరోపణలు చేసినా, పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికీ బిఆర్‌ఎస్‌తో లోపాయకారి అవగాహన ఉందన్న ప్రచారం ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎండగట్టడంతో పాటు, తెలంగాణలో ఓప్రాంతీయ పార్టీ అవసరం ఉందని బిజెపి గుర్తించివుంటుంది. అందుకే బిఆర్‌ఎస్‌ అవినీతిపై మాట్లాడినా పెద్దగా పట్టించుకోవడం లేదు. కవిత విసయంలో కూడా కేసు పెద్దగా బలంగా లేదన్న వాదనలు ఉన్నాయి. ఈ కేసులో కేజ్రీవాల్‌, కవితలు ఇద్దరూ బెయిల్‌పై బయలకు వొచ్చారు. అందుకే గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై బిజెపి నేతలు స్పందించడం లేదు. జగన్‌ లోపాయకారిగా బిజెపికి అనుకూలంగా ఉన్నాడని విమర్శలు ఉన్నాయి.

తెలంగాణలో కూడా కెసిఆర్‌ అనుకూలంగా ఉన్నందువల్లే ఆయనపైనా ఈగ వాలనీయడంలేదని అంటున్నారు.  ఈ విషయమై ఎన్ని విమర్శలు చేసినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో నామమాత్రపు మార్పు కూడా కనిపించడంలేదు. గతంలో విపక్షాలపై అదేపనిగా కేసులు పెట్టడంతో ప్రతిపక్షాలన్నీ కలిసి మూకుమ్ముడిగా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇడి, సిబిఐ వంటి సంస్థలను తమ జేబు సంస్థలుగానే మోదీ  ప్రభుత్వం భావిస్తోందని ఇండియా కూటమి బాహాటంగానే విమర్శిస్తోంది. ప్రతిపక్షనేతలను నయానో, భయానో లొంగదీసుకోవడానికి, అలా లొంగని వారిని కేసులతో వేధించడానికి ఆ సంస్థలను దుర్వినియోగ పరుస్తున్న తీరుపై రాజకీయ పార్టీలో ఆందోళన చెందుతున్నాయి. జార?ండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను కేసుల్లో ఇరికించినా ఆయన మల్లీ అధికారం చేపట్టగలిగారు. బిజెపి నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నందునే ఇడిని ఉపయోగించి కేసులు పెడుతున్నారని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. దేశ రాజధాని దిల్లీలోనూ ఇదే స్థితి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్‌ అధ్యక్షుడు కేజ్రివాల్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఇడి బాధితులుగా మారడానికి కారకులెవరో అందరికీ తెలిసిందే.

ఇలా చెప్పుకుంటూ పోతే బిజెపి దుర్నీతికి, దుర్వినియోగానికి ఉదాహరణాలెన్నో! 2014వ సంవత్సరంలో నరేంద్రమోదీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి గత ఏడాది జనవరి వరకు దేశ వ్యాప్తంగా 121 మంది రాజకీయ నేతలపై ఇడి కేసులు పెట్టి విచారణ చేపట్టింది. వీరిలో 115 మంది అంటే 95 శాతం మంది ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెంది, బిజెపిని గట్టిగా వ్యతిరేకించే వారే కావడం గమనార్హం. ఇలా కేసులు నమోద్కెన వారు బిజెపిలో చేరితే వెంటనే వారిపై నమోద్కెన కేసులను ఎత్తివేయడం, వారిలో కొందరికి ప్రభుత్వ పదవులను సైతం కట్టబెట్టడం మోదీ  సర్కారు బరితెగింపునకు మరో నిదర్శనం. మరోవైపు ఇడి కేసుల్లో నేరం రుజువై శిక్షపడినవి చాలా తక్కువ. అధికారిక లెక్కల ప్రకారం 2011 నుండి ఇడి 1600 కేసులు నమోదు చేసి, 1800 దాడులను ఇడి నిర్వహించింది. అయినా, భయపడుతున్నారంటే ఇతర దర్యాప్తు సంస్థలకు లేని ప్రత్యేక అధికారాలు ఇడి కి ఉండటమే కారణం. ముఖ్యంగా న్యాయస్థానాల అనుమతి లేకుండానే ఆస్తులు జప్తు చేసే అధికారం ఒక సారి కేసు నమోద్కెతే నేరం చేయలేదని రుజువు చేసుకునే బాధ్యత నిందితునిపైనే మోపడం వంటి అధికారాలను ఇ.డి కి అప్పగించారు. ప్రస్తుత పార్లమెంటులోని ప్రతిపక్ష సభ్యుల్లో దాదాపు 90 శాతం మంది ఏదో ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ నిఘానీడలో ఉన్నట్లు ఇటీవల విడుదల్కెన ఒక నివేదిక పేర్కొంది.  తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఈ అధికార దుర్వినియోగాన్ని అరికట్టి, దర్యాప్తు సంస్థల నిష్పాక్షికతపై ప్రజానీకంలో తిరిగి నమ్మకం కలిగించాల్సి ఉంది. దర్యాప్తు సంస్థలకు స్వయం ప్రతిపత్తి మాత్రమే దీనికి పరిష్కారం. ఇలా చేయడం వల్ల నిజంగానే తప్పులు చేసిన వారి భరతం పట్టవొచ్చు.

 -వడ్డె మారన్న    
  9000345368

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *