చైనా సరిహద్దు వెంట ఘోర రోడ్డు ప్రమాదం

– లోయలో పడ్డ ట్రక్కు.. 22మంది దుర్మరణం
– లస్యంగా వెలుగు చూసిన ఘటన

న్యూదిల్లీ,డిసెంబర్‌11: ‌అరుణాచల్‌‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇండో – చైనా సరిహద్దు వెంబడి ఉన్న హుయులియాంగ్‌ – ‌చగ్లగామ్‌ ‌రహదారిపై ఈ ఘటన జరిగింది. అస్సోంలోని టిన్సుకియా జిల్లాకు చెందిన రోజువారీ కూలీలను తీసుకు వెళ్తున్న ఓ ట్రక్కు మార్గమధ్యలో ఈ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ఉన్న 22 మంది కూలీలు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌ ‌హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వాస్తవానికి ఈ ఘటన సోమవారం అంటే మూడు రోజుల క్రితం జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఓ కార్మికుడు గాయాలతో బయటపడి పట్టణానికి చేరుకున్నాడు. అతడు ఇచ్చిన సమాచారంతోనే ఈ  ఘటన గురించి పోలీసులకు తెలిసింది. ఆ కార్మికుడిని మెరుగైన చికిత్స కోసం అస్సాంకు తరలించారు. ప్రమాద ఘటన గురించి అంజావ్‌ ‌జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ‌మిల్లో కొజిన్‌ ‌ధ్రువీకరించారు. ఈ ఘటన అంతర్జాతీయ సరిహద్దుకు 45 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి దాదాపు 10 వేల అడుగుల ఎత్తులో ఉందన్నారు. ఇప్పటివరకు 17 మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. రెస్క్యూ టీమ్‌ ‌సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మిలో కొజిన్‌ ‌వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page