Subbarao sir: మానవ హక్కుల నేత సుబ్బారావు సార్ కు జోహార్లు

1998 లో చందంపేట దగ్గర లోని బంజారా తండాల నుండి శిశువుల అక్రమ అమ్మకం విషయం లో , శిశువుల అమ్మకం వెనక ఉన్న ముఠా పని పని చేస్తున్న విషయాలు విధానం తెలుసుకొని ప్రభుత్వం ముందు వాస్తవాలు పెట్టే ప్రయత్నం లో కూడా సార్ మాతో తిరిగారు. యూరేనియం కు వ్యతి వరేకంగా జరిగిన పెద్ద పాద యాత్రలో, పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య పై విషయసేకరణ చేసిన కార్యక్రమాల్లో కూడా సుబ్బారావు సార్ పాల్గొన్నాడు. పులిచింతల ప్రాజె కు నిర్వాసితులకు న్యాయం చేసే విషయం లో నల్లగొండ ఎ.పి .సి ఎల్.సీ కమిటీ చాలా కృషి చేసింది.” 

కొంతమంది వ్యక్తులు తమ జీవిత కాలంలో సంపదలు కూడ బెట్టకపోయినా, గొప్ప పదవులు చేపట్టక పోయిన తమ నిజాయితీ ద్వారా సమాజంపై చెదరని ముద్ర వేస్తారు. వారు నమ్మిన సిద్ధాంతాలను కేవలం మాటలకే పరిమితం చేయుకుండా తమ ఆచరణ లో ప్రతీక్షింప చేస్తారు. అభ్యుదయ భావాలకు అనుగుణంగా జీవిస్తూ, మానవ విలువల కోసం ,సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తారు. ఇలాంటి వ్యక్తి ఉపాద్యాయుడు కూడా అయితే అయన ప్రభావం మరింత విస్తృతం గా శక్తివంతం గా ఉంటుంది. ఎందుకంటే ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు భోదించే వ్యక్తి మా త్రమే కాదు, విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణానికి, విలువల రూప కల్పన కు మూలాధారం అవుతాడు. ఈ కోవకు చెందిన వ్యక్తే గత వారంతం (జూన్ 4న ) తన 92 వ ఏట, కన్ను మూసిన పొన్నూరు సుబ్బారావు సార్. సుబ్బారావు గారు , కృష్ణాజిల్లా, అమరావతి, దగ్గర లోని పాటిబండ్ల గ్రామం లో,1934,1జులై న జన్మించాడు.
విద్యార్థి దశనుండే సామాజిక అంశాలపై మాట్లాడటం, ఆ ప్రాంతంలో ప్రజల సమస్యలపై పని చేస్తున్న కమ్యునిస్టు పార్టీ, దాని కార్యక్రమా లను గమనిస్తూ తన అవగాహనకు పదును పెట్టు కుంటూ వస్తున్నాడు. పుస్తక పఠనo అంటే చాలా ఇష్టం. అభ్యుదయ సాహిత్యం, రష్యన్ నవలలు చదవడం ప్రారంభించి ఇంగ్లీష్ సాహిత్యం పై మక్కువ పెంచుకొని ఇంగ్లీష్ సాహిత్యంలో ఎం.ఏ డిగ్రీ సాధించే వరకు పట్టుదలతో కృషి చేసాడు. జగ్గయ్యపేటలో ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడు, విద్యార్థుల సనుస్యల పై సమ్మె జరిగినపుడు, అందులో చురుగ్గా పాల్గొన్నారని, ముగ్గురు విద్యార్థులను, స్కూల్ నుంచి సస్పెండ్ చేసారట. అందులో సుబ్బారావు సార్ ఒకరు.జగ్గయ్యపేట ప్రాంతంలో కమ్యూనిస్టు రాజకీయాలు ప్రాచుర్యంలో ఉండేవి. బాల్యదశలో నే సార్ కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడయ్యాడని అర్థం అవుతుంది.
తండ్రికి సరియైన జీవనోపాధి లేక ఇబ్బoదు లు పడుతుంటే సార్ ఇక చదువు కొనసాగించడేమో అనుకున్నారట. వాళ్ళ నాన్న కు స్నేహితుడైన ఒక రెవెన్యూ ఉద్యోగి ఒకాయన సార్ కు చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి జగ్గయ్య పేటకు తీసుకెళ్ళి తన పలుకుబడితో సర్టిఫికెట్లు లేకున్నా, నందిగామ లో ఆరవ తరగతి లో చేర్పించాడట. అక్కడే 1951 లో ఎస్.ఎస్.ఎల్.సీ పూర్తి చేసిన తర్వాత, సార్ ను తండ్రి పట్టుదలతో, గుంటూరు తీసుకెళ్లి హిందూ కాలేజీలో బి.ఎ.లో చేర్పించారు. బి.ఎ లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సార్ కు సహ విద్యార్థి. కాలేజీ రోజుల్లో విద్యార్థుల సమస్యల పై కార్యక్రమాలు నిర్వహిస్తూ చదువు అశ్రద్ధ చేయడంతో బి.ఎ పూర్తి చేయలేకపోయాడు . 1955 లో వివాహం తర్వాత, హుజూర్ నగర్ దగ్గరిలోని గ్రామంలో ప్రయివేట్ స్కూల్ లో టీచర్ గా చేరాడు. అక్కడ ఒక స్కూల్ ఇన్సెక్టర్ సార్ ప్రతిభ ను గమనించి మిర్యాలగూడ లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం రావడానికి సహాయం చేసాడట ఉద్యోగం చేస్తూ అసంపూర్తిగా వదిలిన బి. ఏ. డిగ్రీ పూర్తి చేసాడు. 1971 లో జూనియర్ కళాశాలలో ఇంగ్లీషు బోధించే అధ్యాసకుడుగా పదవి ఉన్నతి పొందాడు.
వివిధ ప్రదేశాల్లో పని చేసి చివరకు నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ ను తన స్థిర నివాసం గా ఎంచుకొని అక్కడే స్థిరపడ్డాడు. తాను నమ్మిన విశ్వాసాల వల్ల ఇబ్బందులు రావడం తో 1984 లో స్వచ్చందంగా పదవీ విరమణ చేసాడు. ఈ లోపు,శ్రీశ్రీ సాహిత్యం, తెలంగాణ రైతాంగ పోరాటం లో పేద రైతులు, కూలీలు నిర్వహించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ఆకళింపు చేసుకున్నాడు. 1970లో విప్లవరచయితల సంఘం ఏర్పడగానే విరసం సభ్యుడిగా చేరి, బెంగాల్ లో ప్రారంభం అయి దేశమంతా దావానంలా వ్యాపిస్తున్న నక్సల్బరీ ఉద్యమo పట్ల ఆకర్షితుడయ్యాడు. మార్క్సిస్ట్ అవగాహన, శాస్త్రీయ దృక్పథంతో , రాష్ట్రంలో జరుగుతున్న ముఖ్యంగా మిరియాల గూడలో పనిచేస్తున్న అన్ని, ప్రజా సంఘాలు,ప్రజాస్వామిక ఉద్యమాలతో సంబంధం పెట్టు కోవడమే కాక వాటి లో భాగమయ్యాడు. ఎక్కువగా చదువుకోని తన సతీమణి సత్యవతి గారిని ప్రైవేట్ గా బి ఎడ్  వరకు చదివించి, ఆమె ఉపాధ్యా యురాలు అయ్యేవరకు ప్రోత్సహించాడు. 2010లో సత్యవతి గారు అనారోగ్యంతో మరణించారు. ఆవిడ అభీష్టం మేరకు ఆవిడ భౌతిక దేహాన్ని కూడా గాంధీ హాస్పిటల్ కు దానం చేసారు.ఆయన భౌతిక దేహాన్ని కూడా కామినేని హాస్పిటల్ కు అందచేయడం జరిగింది.
పదవీ విరమణ చేసి, చైతన్య ట్యూటోరియల్ ను స్థాపించి, తరువాత దాన్ని స్కూల్ గా మార్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను తన సంస్థ ద్వారా అందించడం తో బాటు అన్ని ప్రజా ఉద్యమాలతో సంబంధాలు పెట్టుకొని, ఉద్యమాలలో ప్రజా సమస్యలపై క్రియాశీలకంగా పని చేయుడo మొదలు పెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగం లో ఉన్నప్పుడు స్థానిక రాజకీయ ప్రజా ప్రతినిధి, ప్రభుత్వానికి వ్యతిరేక  రాజకీయాలలో పాల్గొoటున్నావని హెచ్చరిక చేసి, పలుమార్లు మిర్యాలగూడ నుండి బదిలీ చేయించినా తన విశ్వాసాల పట్ల ధృడంగా నిలుచున్నాడు. హేతువాద సంఘం, జనవిజ్ఞాన వేదిక, ఉపాధ్యాయ సంఘం, నల్లగొండ జలసా ధన సమితి , ఇంకా ఎన్నో ప్రజా సంఘాల లో పనిచేస్తూ ప్రజాస్వామిక భావాలు గల, విలువల కోసం కృషి చేసే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రజలను గమనిస్తూ, వారికుండే వ్యక్తిగత సమస్యలు తీర్చడానికి కృషి చేసాడు. మిర్యాలగూడ లో కులాంతర వివాహం కట్నంలేని, సాంప్రదాయం  పాటించని వివాహం జరుగాలంటే సుబ్బారావు సార్ ఉండవలసిందే. 2018 లో దళిత యువకుడి ప్రణయ్ పరువు హత్య సంఘటన లో ప్రజాసంఘాల ను, ప్రజాస్వామిక పౌరుల ను ఐక్యo అయి ఉద్యమం రూపం తీసుకోవడం, సార్ వల్లే సాధ్యం అయింది.
సుబ్బారావు సార్ నక్సలైట్ రాజకీయాల పట్ల ఆకర్షితుడైనా ఎందుకో,సార్ హక్కుల సంఘలోకి ఆలస్యం గా ప్రవేశిoచాడు. నేను మొదటి సారి, బహుశా 1976 లో కాళోజి తో నల్లగొండ లో సాహితీ మిత్రమoడలి సమావేశానికి వెళ్ళినప్పుడు, సుబ్బారావు సార్ నాకు పరిచయం అయ్యాడు. శేషు, సుదర్శన్ సార్ ల తో కలిసి చైతన్య సమాఖ్య అనే సాహితీ సంస్థ నడుపుతున్నట్టు తెలిపాడు. 1987 లో ఎ.పి.సి.ఎల్. సి నల్లగొండ యూనిట్ ప్రారంభం అయినప్పుడు,సార్ కు ఉపాధ్యక్షుడి బాధ్యత అప్పచెప్పారు. తరువాత బాలగోపాల్ సార్ ను నేను కలిసి న ప్పుడు సార్ గురించి చెప్పాడు. ‘ఒక పెద్దాయన, రిటైర్డ్ ఇంగ్లీషు ల్చెరర్,మన సంస్థలో చేరాడు. మిర్యాలగూడ లో ఆయన కు మంచి మనిషి గా పేరుంది’ అన్నాడు. సార్ ఏ. పి. సి. ఎల్. సి, నల్గొండ శాఖ కు ఒక సారి జిల్లా ఉపాఅధ్యక్షుడుగా, మానవ హక్కుల వేదిక ఏర్పడ్డ తరువాత రెండు సార్లు జిల్లా అధ్యక్షుడు గా ఉన్నాడు. 2005 లో మానవ హక్కుల వేదిక మొదటి మహాసభ మిర్యాలగూడ లోనే జరిపాం . దాని నిర్వహణ కోసం, సార్, అనుయాయులు , శిష్య బృందం, తొడ్పాటు తో బాటు సార్ కృషి వల్ల విజయవంతం చేయగలిగాం.
ఆయన హక్కుల రంగం లోకి వచ్చినప్పటి నుండి నుండి సంఘం కార్యక్రమాలలో నల్లగొండ జిల్లాలో ఎన్కౌంటర్లు, లాకప్ మరణాలు, గ్రామాలలో ప్రజల పై పోలీసుల దాడుల విషయంలో నిజ నిర్ధారణ చేయడానికి, బాలగోపాల్, ఇతర సభ్యులతో సహా పాల్గొన్నాడు. 1998 లో చందంపేట దగ్గర లోని బంజారా తండాల నుండి శిశువుల అక్రమ అమ్మకం విషయం లో , శిశువుల అమ్మకం వెనక ఉన్న ముఠా పని పని చేస్తున్న విషయాలు విధానం తెలుసుకొని ప్రభుత్వం ముందు వాస్తవాలు పెట్టే ప్రయత్నం లో కూడా సార్ మాతో తిరిగారు. యూరేనియం కు వ్యతి వరేకంగా జరిగిన పెద్ద పాద యాత్రలో, పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య పై విషయసేకరణ చేసిన కార్యక్రమాల్లో కూడా సుబ్బారావు సార్ పాల్గొన్నాడు. పులిచింతల ప్రాజె కు నిర్వాసితులకు న్యాయం చేసే విషయం లో నల్లగొండ ఎ.పి .సి ఎల్.సీ కమిటీ చాలా కృషి చేసింది. నాగార్జున సాగర్ నిర్మాణం సమయoలో ఉద్యోగుల కోసం మిర్యాలగూడ లో నిర్మించిన క్యాంపు క్వార్టర్స్, అన్యాక్రాంతం అయి, రౌడీలు, రాజకీయనాయులు,వాటిని ఆక్రమించుకొని ఉంటున్న విషయంలో సార్ అసలైన ఉద్యోగుల్ని ఐక్యం చేసి, ఆ ఇండ్లు వాళ్లకే ఇవ్వాలని ఆందోళన చేసాడు. నేను రెండుసార్లు సార్ పిలవడంతో మిర్యాలగూడకు వెళ్లి సార్ తో కలిసి తిరిగి చాలా వివరాలు సేకరించి, ప్రభుత్వా నికి నివేదిక సమ ర్పించాను.
ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘంలో అడుగులు వేసిన ఆయన 1998లో మానవ హక్కుల వేదిక లో ప్రయాణిస్తూ మరణించే వరకు ఈ సంస్థలోనే ఉన్నాడు. ఈ మొత్తం క్రమంలో బాలగోపాల్ సార్ కు అత్యంత సన్నిహతుడు గా అభిమానిగా తయారైనాడు. బాలగోపాల్ సార్ కూడా సుబ్బారావు సార్ అంటే ఎనలేని గౌరవం చూపేవాడు. 2008 లో సుబ్బారావు సార్ కు గుండె శస్త్రచికిత్స జరిగినపుడు, బాలగోపాల్ సార్ దాదాపు నెల రోజులు ప్రతి రోజు హాస్పిటల్ కు పోయి సార్ ను పరామర్శించి వచ్చేవాడు. సుబ్బారావు సార్ కు గుండె శస్త్రచికిత్స తరువాత ఆయన ప్రయాణాలు చేయడం, కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించాడు.  ప్రజా ఆందోళన సంస్థల్లో పని చేసే వారు ఎవరు సార్ ఇంటికి వెళ్ళినా, తన బాధ్యత గా, కార్యక్రమాల నిర్వహణకు తన వంతుగా,వాళ్ళకు డబ్బులు ఇచ్చే వాడు. ప్రొ.కొదండ రామ్ సార్ కి కూడా రెండు పర్యాయాలు బలవంతoగా డబ్బులు చేతిలో పెట్టాడని కోదoడరామ్ సార్ నాకు చెప్పాడు. పాత కమ్యూనిస్టు కార్యకర్తలకు ఉండే విలువలు సార్ బాగా పాటించేవాడు.
ఎవరు సమావేశానికి వక్తగా వచ్చినా వాళ్లకు ప్రయాణపు ఖర్చులు ఇచ్చేవాడు. నాకు జీతం వస్తుంది అని నేను ఎప్పుడు సార్ నుండి డబ్బులు తీసుకునేవాడిని కాదు. ఎవరు ఏ అవసరానికి వచ్చినా వారికి వీలైనంత సహాయం చేసేవాడు. ఆరోగ్యసమస్యల తో ఎవరైనా హైదరాబాద్ లో హాస్పిటల్  కి పోవాల్సి వస్తే,కొంచెం వాళ్లను చూసుకో జీవన్ అని ఫోన్ చేసేవాడు. తన శిష్యులుగా ఉండే వాళ్లకు జీవనోపాధి ఇబ్బందిగా ఉంటే, హైదరాబాద్ కు పంపి,వాళ్ళ ను ఎక్కడైనా సంస్థలో పెట్టించండి అని అనే వాడు. అట్లా ఇద్దరిని నా దగ్గరికే వంపితే నేనొక స్వచ్ఛంద సంస్థలో పెట్టించాను. సార్ శిష్యుల్లో బాగా ధనవంతులు ఉన్నా, రాజకీయ నాయకులున్నా వారి నుండి ఎప్పుడు ఏ సహాయం తీసుకోలేదు. ఆపరేషన్ జరిగినప్పుడు అప్పుడు హోం మంత్రి గా ఉన్న జానారెడ్డి గారు,చూడడానికి వచ్చినప్పుడు డబ్బు ఏమైనా కావాలా సార్ అంటే నిర్మోహమాటంగా వద్దని చెప్పాడు.
సుబ్బారావు సార్ ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుర్లు. అందరు సార్ నుండి విలువలు పుణికి పుచ్చుకున్న వారే. తన దగ్గర నిలువ ఉన్న కొంచెం డబ్బు, తాను నిర్మించుకున్న ఇల్లు అందరికీ సమానంగా పంచి ఇచ్చినట్టు విన్నాం. చివరకు తన మరణం తరువాత అయే ఖర్చులకు కూడా కొంత డబ్బు ఉంచాడని తెలిసింది. ఆయన ప్రియంగా దాచుకొని, ఆచరించిన విలువల్లో కొన్నింటినైనా మనం ఆకళింపు చేసుకోవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. మానవ హక్కుల వేదిక రెండు రాష్ట్రాల సభ్యుల తరపున సుబ్బారావు సార్ కు జోహార్లు.
యస్. జీవన్ కుమార్
మానవ హక్కుల వేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *