నన్ను చంపాలనుకుంటే..

‌- ఇరాన్‌పై వేయి క్షిపణులు ఏకకాలంలో దాడి
– ఊహించని విధంగా ఇరాన్‌ను అంతం చేస్తాం
– సైన్యానికి ఆదేశాలు ఇచ్చాను
– సొంత సోషల్‌ ‌మీడియా ట్రూత్‌లో ట్రంప్‌ ‌హెచ్చరికలు

వాషింగ్టన్‌,‌ జూలై 11: అమెరికా-ఇరాన్‌ ‌మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరినప్పటికీ ఉద్రిక్తతలు ఏమాత్రం సమసిపోలేదు. రెండుదేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌మరో వార్నింగ్‌ ఇచ్చారు. ఒకవేళ వారు తనను హత్య చేయాలని ప్రయత్నిస్తే.. క్షిపణుల వర్షం తప్పదని హెచ్చరించారు. డొనాల్డ్ ‌ట్రంప్‌ ఇరాన్‌కు మరోసారి ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. తనపై హత్యాయత్నం చేయడానికి ఇరాన్‌ ‌ప్రయత్నిస్తే, ఆ దేశంపై క్షిపణుల వర్షం తప్పదని వార్నింగ్‌ ఇచ్చారు. తాము ఇప్పటికే వెయ్యి క్షిపణులను సిద్ధం చేసి ఉంచామని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే వేల క్షిపణులతో భారీ ప్రతీకార దాడులు జరుగుతాయని ట్రంప్‌ ‌తన సామాజిక మాధ్యమ వేదిక ’ట్రూత్‌’ ‌ద్వారా వెల్లడించారు. నన్ను హత్య చేయాలని ఇరాన్‌ ‌ప్రయత్నిస్తే భారీ విధ్వంసం తప్పదు. వెయ్యి క్షిపణులు ఇప్పటికే లక్ష్యాలను గురిపెట్టి సిద్ధంగా ఉన్నాయి. అంతటితోనే ఆగదు. అవసరమైతే మరిన్ని దాడులు జరుగుతాయి. ఇప్పటికే ఈ విషయమై సైన్యానికి ఆదేశాలు అందాయి. ఇరాన్‌లోని అన్ని ప్రాంతాలను ధ్వంసం చేయడానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉంది’ అని ట్రంప్‌ ‌హెచ్చరించారు. తనపై ఇరాన్‌ ‌హత్యాయత్నం చేసే అవకాశం ఉందని గతంలో కూడా ట్రంప్‌ ఆరోపించారు. అలాంటి ప్రయత్నం జరిగితే అమెరికా ప్రతిస్పందన అత్యంత తీవ్రంగా ఉంటుందని, ఇరాన్‌ ‌కీలక సైనిక స్థావరాలపై భారీ దాడులు జరుగుతాయని స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే హోర్ముజ్‌ ‌జలసంధి, అణు ఒప్పందం వంటి అంశాలపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ హెచ్చరికలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశం కనబడుతోంది. ఇరాన్‌లోని అన్ని ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేయడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అంతకుముందు డియాతో మాట్లాడుతూ ట్రంప్‌ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తనను చంపడంలో ఆ దేశం సఫలమైతే.. తదుపరి ఏం చేయాలన్నదానిపై ఇప్పటికే సూచనలు జారీ చేశానన్నారు. ‘ఏదైనా జరిగితే.. ఇంతకు ముందెన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇరాన్‌ ‌పై బాంబుల వర్షం కురిపించాలని నేను సూచనలు జారీ చేశా. అయితే టెహ్రాన్‌ ‌నన్ను చంపడంలో విఫలమవుతుందని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. హర్మూజ్‌లో ప్రయాణిస్తోన్న నౌకలపై ఇరాన్‌ ‌దాడులు చేయడం.. ఆ వెంటనే ఆ దేశంపై అమెరికా క్షిపణుల వర్షం కురిపించడంతో మరోసారి పశ్చిమాసియాను యుద్ధమేఘాలు కమ్మేశాయి. ఈ క్రమంలోనే డీల్‌ ‌ముగిసిందంటూ ట్రంప్‌ ‌ప్రకటన చేశారు. దాంతో.. ఇప్పటికే అంగీకరించిన అంశాల్లో వేటినైనా ఉల్లంఘిస్తే ప్రతిచర్య తప్పదని ఇరాన్‌ ‌హెచ్చరించింది. చర్చలను కొనసాగించాలని తాము కోరినట్లు ట్రంప్‌ ‌చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించింది. తాము లొంగిపోవడంతోనే యుద్ధం ముగియదని ఇరాన్‌ ‌పార్లమెంటర్‌ ‌స్పీకర్‌ ‌ఘాలిబఫ్‌ ‌పేర్కొన్నారు. యుద్దాన్ని ముగించడం ప్రపంచ దేశాలకు ప్రాధాన్యాంశం. ఇరాన్‌ ‌లొంగిపోవడంతో ఎప్పటికీ ఈ యుద్ధం ముగిసిపోదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అమెరికన్లు ఎప్పుడైతే అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారో.. అప్పుడు మమ్మల్ని మేము రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంటాం అని వెల్లడించారు. అలాగే యుద్దానికి సిద్ధంగా ఉన్నవారే.. అమెరికాతో చర్చలు జరపగలరని వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *