•నగర వాసులకు ఉన్నత జీవన ప్రమాణాలను కల్పించడమే లక్ష్యం
•దీనికి అన్ని పార్టీలు సహకరించాలి
•శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: ‘‘మూసీ ప్రక్షాళన’’ జరగకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయ త్నం చేస్తు న్నారని అయినా ఈ విష యంలో ప్రభు త్వం వెనక డుగేయదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మూసీ ప్రక్షా ళనకు అన్ని పార్టీలు సహకరించాలని, డీపీఆర్ రూప కల్పనలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. మంగళవారం శాసన మండలిలో ‘‘మూసీ ప్రక్షాళన’’పై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. మూసీ ప్రక్షాళన పేరిట బీఆర్‌ఎస్ పార్టీ హడావిడి చేసింది. కానీ.. చేసిందేం లేదు. చిన్న చిన్న తప్పులను భూతద్దంలో చూపించడం సరికాదు. ప్రతి దానిని రాజకీయం చేయొద్దు. ఇది మన బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందని గుర్తించాలి. హైదరాబాద్ నగర వాసులకు అత్యుత్తమ జీవన ప్రమాణాలను కల్పించా లన్నదే మా సంకల్పం. స్వచ్ఛమైన గాలి, నీటిని అందించేందుకే మా ఈ ప్రయత్నం. మూసీ పునర్జీవనమే మా లక్ష్యం.
‘‘మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్’’ద్వారా మూసీ ప్రక్షాళనను దశల వారీగా చేపట్టేం దుకు ప్రణాళికలు రూపొందించాం. మూసీ ప్రక్షాళన పనుల్లో ఎలాంటి జాప్యం లేదు. డీపీఆర్ సిద్ధం అవుతోంది. మొదటి దశలో బాపుఘాట్ దగ్గర ‘‘గాంధీ సరోవర్ ప్రాజెక్ట్’’ పేరిట పనులు చేపడతాం. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. మూసీ ప్రక్షాళనను అత్యంత ప్రణాళి కాబద్ధంగా చేపడతాం. కన్సల్టెన్సీ నుంచి నివేదిక అందిన తర్వాత రెండో దశ, మూడో దశ పనులపై నిపుణులను భాగస్వామ్యం చేసి నిర్ణయం తీసుకుంటాం. మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే పేదలకు ఇబ్బంది కలగకుండా వారిని ఒప్పించి… అపోహాలను తొలగించి… వారికి ప్రత్యామ్నాయం చూపించే మూసీ ప్రక్షాళన చేపడతాం. నమో గంగే, సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల మాదిరిగానే మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. కానీ… ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
గోదావరి నది నుంచి 2.5 టీఎంసీ నీటిని మూసీ కి తరలించేందుకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. కానీ… కేంద్రం స్పందించడం లేదని ఆరోపించారు. నిధుల కేటాయింపులో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందని, తెలంగాణ కూడా ఈ దేశంలోనే భాగమని గుర్తించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు చొరవ చూపి… ఈ ప్రాజెక్ట్ కు కేంద్రం నిధులు కేటాయించేలా చొరవ చూపాలని కోరారు. మూసీ ప్రక్షాళన లో ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్ రూం ఇస్తామని, ఇప్పటికే 309 మంది కి ఇచ్చామని చెప్పారు. ప్రతిపక్షాలు వొస్తే ఎక్కడ… ఎవరెవరికి ఇచ్చామో చూపిస్తామని, మూసీ ప్రక్షాళన లో ఉపాధి కోల్పోయే వారికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుందన్నారు. చట్ట ప్రకారం నష్ట పరిహారం అందజేస్తామని ఎవరికీ అన్యాయం జరగదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.