సమస్యల పరిష్కారమే లక్ష్యం

– 3 నెలల్లో దరఖాస్తుల కొలిక్కి కార్యాచరణ
– పాలేరు ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి

కూసుమంచి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : ప్రజల సమస్యలను వారి గడప వద్దే పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ‘ప్రజాదర్బార’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన న్యాయబద్ధమైన దరఖాస్తులన్నింటినీ మూడు నెలల్లోగా పరిష్కరించేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించామన్నారు. నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని మÖడు క్లస్టర్లుగా విభజించి ప్రతి దరఖాస్తుపై జవాబుదారీతనంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం మనిషికి ఆధార్ లాగే ప్రతీ భూమికి ‘భూధార’ నంబర్ ఇస్తున్నామని, కూసుమంచి మండలంలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. నిర్మాణ పురోగతినిబట్టి ప్రతి సోమవారం లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా బిల్లులు జమ చేస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం మే 4న ఖమ్మంలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 80కిపైగా కంపెనీలు ఇందులో పాల్గొంటాయని తెలిపారు. దీనిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరి, మొక్కజొన్న పంటలను మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నామంటూ నిధులను రికార్డు సమయంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. భూసేకరణ వంటి పెండింగ్ అంశాలను వారం రోజుల్లోగా పరిష్కరించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *