– కళ్ల ముందు కనిపించే నిజం
– దానికి సాక్ష్యమే ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్
– ‘ఎక్స్’లో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : భారత దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అన్నది ఇకపైౖ ఒక నినాదం మాత్రమే కాదు.. కళ్ల ముందు కనిపించే నిజం. ఆ నిజానికి సాక్ష్యం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. మేధావుల సలహాలు, విజ్ఞుల సూచనలతో తెలంగాణ విద్యా వ్యవస్థ చరిత్రను విప్లవాత్మక సంస్కరణలతో తిరిగి రాయాలన్న నా సంకల్పానికి రూపం తెలంగాణ పబ్లిక్ స్కూల్.. చరిత్ర పుటల్లో కలిసిపోతున్న సర్కారు బడి ప్రజా పాలనలో నేడు మళ్లీ పూర్వవైభవాన్ని మించిన వైభవంతో, సకల సౌకర్యాలతో, ఆధునిక వసతులతో, పిల్లల మేధో వికాస క్షేత్రంగా నిలవబోతోంది.. తెలంగాణ బిడ్డల పాలిట సరస్వతీ కటాక్ష ఆలయంగా రూపుదిద్దుకున్నది.. ఆకలి తీర్చి, అక్షరాలు నేర్పి, ఆటలను ప్రోత్సహించి పిల్లల్లో మనో వికాసం పెంపొందేలా, మట్టిలో మాణిక్యాలను తీర్చిదిద్దే సకల హంగులతో రూపుదిద్దుకున్న నా మానస పుత్రిక ఈ పాఠశాల.. తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు రూపం ఇచ్చే కార్యంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. విద్యార్థులకు అభినందనలు. ఆరుట్లలో ఆవిష్కృతమవుతున్న నేటి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో వంద తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నెలకొల్పడం తదుపరి మా కర్తవ్యం.. అని ఆ పోస్టులో వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




