‘మనీ’గోడులో కనకవర్షం
మునుగోడు ‘మనీ’గోడుగా మారింది. గతంలో ఏనాడు లేని విధంగా ఇప్పుడా నియోజకవర్గంలో కనక వర్షం కురుస్తున్నది. ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వోట్లకోసం విపరీతంగా డబ్బులు కుమ్మరిస్తున్నాయి. ఇక్కడి సిట్టింగ్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసినప్పటినుండే రాజకీయ పార్టీలు నియోజకవర్గంలోని ఊళ్ళను కలియ తిరగడం…
