- ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి
- పర్యావరణ పరిరక్షణకు ముందుకు రావాలి
- సిఎం రేవంత్ రెడ్డి పిలుపు
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్ 05: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కార్యాలయం తరఫున ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. ప్రకృతిని మనం కాపాడితే, అదే మనల్ని కాపాడుతుందని సీఎం స్పష్టంగా తెలిపారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణగా ఉన్న నేపథ్యంలో, ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించే దిశగా కృషి చేయాలని, దానికి సంబంధించి ప్రతిజ్ఞ చేయాలని సీఎం కోరారు. సహజ వనరుల సంరక్షణకు ప్రతిసారీ ప్రభుత్వం కట్టు-బడి ఉంటుందని, రాబోయే తరాల కోసం ఈ వనరులను నిలుపుదల చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు.