ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం మీదే

– పరీక్షలపై విద్యార్థులకు అవగాహన

అల్వాల్, ప్రజాతంత్ర, మార్చి 11: స్థానిక మహాబోధి విద్యాలయంలో పరీక్షలంటే భయమెందుకు అనే అంశంపై హైస్కూల్ విద్యార్థులకు వర్క్ షాప్ నిర్వహించారు. సానుకూల దృక్పథం, లక్ష్య సాధన, ఆరోగ్యం ఆహారంపై స్కూల్ నిర్వాహక కమిటీ సభ్యులు విమలమ్మ, వెన్నెల గద్దర్, పూర్వ ఐఏఎస్ ఆఫీసర్ జెబి రాజు, డా. యం.సురేష్ బాబు, రంగారెడ్డి, పాండు వెన్నెల తదితరులు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ప్రతి వ్యక్తి తనకు తానే స్వయంగా క్రమశిక్షణకు పాటుపడాలి. దీనిని అంతర్గత క్రమశిక్షణ అంటారు. ఇది మంచి ఫలితాలనిస్తుంది. విద్యార్థులు మంచి ఆరోగ్య, ఆహార అలవాట్లు పెంపొందించుకొని ప్రణాళికాబద్దంగా చదివి మంచి ఆశయ సాధన కోసం అహర్నిశలు కష్టపడాలన్నారు. విమలమ్మ మాట్లాడుతూ విద్యార్థులు తల్లితండ్రులను గౌరవించి, సత్ప్రవర్తనతో మెలగాలని, చదువుకున్న పాఠశాలకు అధ్యాపకులకు మంచి పేరు తేవాలన్నారు. జెబి రాజు మాట్లాడుతూ పిల్లలు ప్రణాళికాబద్దంగా చదివి సమకాలీన అంశాలను అర్థం చేసుకోవాలని సూచించారు. ఉత్తమ పౌర సమాజం దిశగా ఐక్యతతో మెలగాలన్నారు. సురేష్ బాబు మాట్లాడుతూ ప్రపంచమంతా ఒక క్రమమైన పరిణామం కనిపిస్తుంది. రాత్రి, పగలు, నెలలు, ఋతువులు, సంవత్సరాలు ఒక క్రమ పద్ధతిలో వస్తాయి. అలాగే గ్రహాల గతి కూడా. ఇలా సృష్టి ఏ విధంగా క్రమానుగతంగా తన విధులను నిర్వర్తిస్తోందో్ అదేవిధంగా మానవులు కూడా తమ విధులు నిర్వర్తించాలని ఉద్బోధించారు. పదవ తరగతి విద్యార్థులందరికీ ప‌రీక్ష‌కిట్స్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జీ.రాము, ప్రిన్సిపాల్ భవాని, .ఉపాధ్యాయ‌, ఉపాధ్యాయేత‌ర‌ బృందం పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *